LOADING...
Donald Trump: టారిఫ్ ల పవర్ తోనే ఇండియా పాకిస్థాన్ యుద్ధం ఆపాను: డొనాల్డ్ ట్రంప్ 
టారిఫ్ ల పవర్ తోనే ఇండియా పాకిస్థాన్ యుద్ధం ఆపాను: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: టారిఫ్ ల పవర్ తోనే ఇండియా పాకిస్థాన్ యుద్ధం ఆపాను: డొనాల్డ్ ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ యుద్ధాలను ఆపగలిగే శక్తి అమెరికాకు ఉన్న టారిఫ్ విధించే సామర్థ్యమే అని ఆయన పేర్కొన్నారు. ఈ శక్తి లేకపోతే, ప్రస్తుతం కనీసం నాలుగు దేశాల మధ్య భయంకర యుద్ధాలు జరుగుతున్న ఉండేవని ట్రంప్ వివరించారు. వివిధ దేశాలపై టారిఫ్ విధించడం ద్వారా ప్రపంచంలో శాంతిని నెలకొల్పడమే కాక, అమెరికాకు భారీ మొత్తంలో ఆదాయం సమకూర్చినదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ సోమవారం వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేశారు.

వివరాలు 

ఇండియా పాకిస్థాన్ యుద్ధం తానే ఆపానని మరోమారు వ్యాఖ్య 

భారత్,పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తాను ఆపినట్లు ఆయన మరోసారి తెలిపారు. వ్యాపార ఒప్పందాల సందర్భంలో టారిఫ్ విధిస్తానని హెచ్చరించడం ద్వారా రెండు దేశాలను ఒప్పించి యుద్ధాన్ని నిలిపించానని ట్రంప్ వెల్లడించారు. అణ్వాయుధ శక్తులతో కూడిన భారత్, పాక్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత కనీసం ఏడు ఫైటర్ జెట్లు కూలిపోయాయని ట్రంప్ చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరగేలా కృషి చేశానని చెప్పారు. అయితే, ఈ ఒప్పందానికి భారత్, పాక్‌లను ఏ విధంగా బెదిరించారో అనే వివరాలు ఆయన వెల్లడించలేదు.