
Armenia-Azerbaija: ట్రంప్ గందరగోళం … ఐరోపా నేతల సెటైర్లు,మెక్రాన్ నవ్వులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆర్మేనియా,అజర్బైజాన్ దేశాల మధ్య తాను శాంతి ఒప్పందాన్ని కుదుర్చినట్లు అనేకసార్లు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనలను చేస్తున్నప్పుడు ఆయన తరచుగా 'ఆర్మేనియా' దేశం పేరును 'అల్బేనియా'గా తప్పుగా పేర్కొని గందరగోళాన్ని సృష్టించారు. ఈ సంఘటన ఐరోపా సమాఖ్య నేతల మధ్య చర్చనీయాంశమైంది. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో వారు ట్రంప్ గురించి వ్యంగ్యంగా మాట్లాడుకున్నారు. గురువారం కోపెన్హాగన్లో జరిగిన ఐరోపా నేతల సమావేశంలో,అల్బేనియా ప్రధానమంత్రి ఏడీ రహ్మా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రోన్, అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్తో సరదాగా మాట్లాడారు.
వివరాలు
అందుకు నన్ను మన్నించండి
ఈ సందర్భంగా ఏడీ రహ్మా, "అల్బేనియా, అజర్బైజాన్ మధ్య ట్రంప్ శాంతి కుదుర్చారు. దీనికి గాను మీరు మాకు ఇంతవరకు ఎలాంటి అభినందనలు చెప్పలేదు. కాబట్టి మీరు క్షమాపణలు చెప్పాల్సిందే" అని సరదాగా మాట్లాడారు. ఈ మాటలకు అలియేవ్ పకపక నవ్వారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రోన్ కూడా ఇదే వ్యంగ్య భావంతో స్పందించి, "నన్ను మన్నించండి" అంటూ నవ్వుతూ రహ్మాను ఫ్రెండ్లీగా టచ్ చేశారు. గతంలో ట్రంప్ శాంతి ఒప్పందంపై మాట్లాడేటప్పుడు, అర్మేనియా పేరు "అల్బేనియా" అని పలికారు. ఇదే కారణంగా రహ్మా సరదాగా విమర్శ చేశారు. అలాగే, అజర్‌బైజాన్‌కు "అబర్‌బైజాన్" అని పేరు చెప్పడం,ఇటీవల కంబోడియా-అర్మేనియా మధ్య ఘర్షణను ఆపినట్టు చెప్పడం కూడా చర్చలో భాగమైంది.
వివరాలు
35 ఏళ్లుగా వారిరువురూ పోరాడుకున్నారు
ఆ రెండు దేశాల మధ్య దూరం సుమారు 7,000కిలోమీటర్లు ఉండటాన్ని విశేషంగా పేర్కొన్నారు. జూలైలో థాయ్‌లాండ్-కంబోడియా మధ్య కొన్ని రోజుల యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు,దానిని కూడా తానే ఆపానని ట్రంప్ పదేపదే చెప్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణకు ముగింపు కట్టాలని లక్ష్యంగా,ఆర్మేనియా,అజర్‌బైజాన్ దేశాధినేతలు అమెరికా మధ్యవర్తిత్వంతో ఆగస్టులో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో,అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియెవ్, ఆర్మేనియా ప్రధానమంత్రి నికొల్ పాశిన్యాన్‌లు ఒప్పందానికి సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సామాజిక మాధ్యమం"ట్రూత్ సోషల్"లో ప్రకటిస్తూ,"35 ఏళ్లుగా రెండు దేశాలు యుద్ధం చేశారు.ఇకపై వారిద్దరం మధ్య శత్రుత్వం కాకుండా స్నేహం ఉంటుంది.యుద్ధాన్ని ముగించడానికి అనేక నేతలు ప్రయత్నించగా విఫలమయ్యారు.థాంక్స్ టు ట్రంప్"అని పేర్కొన్నారు.