LOADING...
Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నట్లు సంకేతాలు
పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నట్లు సంకేతాలు

Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నట్లు సంకేతాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై తరచూ తీవ్ర విమర్శలు చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆశ్చర్యంగా ఫోన్ సంభాషణ చేశారు అయితే ఈ సంభాషణ ఏమాత్రం కూల్..కూల్‌గా కాకుండా..పరస్పరం ఘాటు వ్యాఖ్యల మధ్య హాట్ హాట్‌గా కొనసాగినట్లు సమాచారం. సెప్టెంబర్ నెల నుంచి వెనిజులా నుంచి లాటిన్ అమెరికాలోని ఇతర దేశాలకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకొని అమెరికా సముద్ర దాడులు చేస్తోంది. ఈదాడుల్లో ఇప్పటికే పలువురు స్మగ్లర్లు మృతిచెందారు.ఈపరిణామాల నేపథ్యంలో రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం మదురోతో ట్రంప్ ఫోన్ సంభాషణ జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాను మదురోతో మాట్లాడిన విషయాన్ని ట్రంప్ ధృవీకరించినప్పటికీ,సంభాషణకుసంబంధించిన వివరాలను వెల్లడించలేనని తెలిపారు.

వివరాలు 

ఇద్దరి మధ్య హాట్ హాట్ గా వాగ్వాదం

మయామీ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. మదురో దేశం విడిచి సురక్షితంగా వెళ్లేందుకు ట్రంప్ అవకాశం కల్పించినట్లు సమాచారం. అది కూడా వెంటనే రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య హాట్ హాట్ గా వాగ్వాదం జరిగినట్టు పేర్కొంది. అయితే తనకు, తన సహచరులకు కేసుల్లో ఇరుక్కొని ప్రపంచవ్యాప్తంగా క్షమాభిక్ష కోరడంతో పాటు సాయుధ దళాలపై తనకే నియంత్రణ ఉండాలనే షరతులు మదురో ముందుంచినట్టు సమాచారం. తక్షణ రాజీనామాతో పాటు దేశం విడిచి వెళ్లాలన్న ప్రతిపాదనను మదురో తిరస్కరించినట్టు తెలుస్తోంది.

వివరాలు 

వెనిజులా వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసేలా ఆదేశాలు

ఇద్దరి మధ్య చర్చలు విఫలమవడంతో ట్రంప్ దూకుడు పెంచినట్టు సమాచారం. వెనిజులా రాజధాని కారకాస్‌పై ఒత్తిడి మరింతగా పెంచుతున్నారని తెలుస్తోంది. అమెరికా సైనిక కార్యకలాపాలు త్వరలోనే వెనిజులాలో ప్రారంభమయ్యే అవకాశముందని ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్‌తో పాటు మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‌ను వెనిజులా తీరానికి సమీపంలో మోహరించినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు అమెరికా చర్యలను మదురో తీవ్రంగా ఖండించారు. వాటిని దురాక్రమణ చర్యలుగా అభివర్ణించారు. వెనిజुलా చమురు నిల్వలను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

Advertisement