LOADING...
Donald Trump: ట్రంప్ ఆగ్రహం.. కెనడాపై సుంకాలను 10 శాతం పెంపు!
ట్రంప్ ఆగ్రహం.. కెనడాపై సుంకాలను 10 శాతం పెంపు!

Donald Trump: ట్రంప్ ఆగ్రహం.. కెనడాపై సుంకాలను 10 శాతం పెంపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించారు. ఇటీవల కెనడియన్ వస్తువులపై సుంకాలను అదనంగా 10 శాతం పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పూర్వ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాడు సుంకాలపై చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్పులను కెనడా ప్రసారం చేసిన విధానంతో తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ మాట్లాడుతూ, పొరుగు దేశం కెనడా రూపొందించిన ఒక టీవీ వాణిజ్య ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కారణంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. అమెరికా ఇటీవలే కెనడాపై 35 శాతం నుంచి 50 శాతం సుంకాలు విధించింది.

Details

సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో ముప్పును కలిగిస్తాయి

ఈ సుంకాలను తగ్గించే చర్చలు రెండు దేశాల మధ్య జరుగుతున్న తరుణంలో, ఈ ప్రకటన ట్రంప్‌కు ఇబ్బందికరంగా నిలిచింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఓవల్ ఆఫీస్‌లో స్నేహపూర్వక సమావేశం జరిగినప్పటికీ, ఈ ప్రకటన కారణంగా ట్రంప్ చర్చలను రద్దు చేయాలని ప్రకటించారు. ఈ ప్రకటన కెనడా ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ప్రసారం చేసింది. ఇందులో రొనాల్డ్ రీగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకు ముప్పు కలిగిస్తాయన్నారు. ఈ ప్రకటన అమెరికా టీవీ ఛానెల్స్‌లో గత వారం రోజులుగా ప్రసారం అవుతోంది.

Details

ఆ ప్రకటనను ఖండించిన రోనాల్డ్ రీగన్

అమెరికాలో సుంకాల పై సుప్రీంకోర్టు త్వరలో తీర్పును ప్రకటించనుంది. ట్రంప్ అభిప్రాయ ప్రకారం, కెనడా ఈ ప్రకటనను కోర్టు తీర్పును ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో ప్రచారంలోకి తీసుకువచ్చింది. రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ కూడా ఈ ప్రకటనను ఖండించింది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు. "వారు ఈ ప్రకటనను వెంటనే తీసివేయాలి. ఇది మోసపూరితమైనది, అలాగే వరల్డ్ సిరీస్ సమయంలో ప్రసారం చేయడానికి అనుమతించారని పేర్కొన్నారు.