Donald Trump: ట్రంప్ మంత్రులకు ప్రాణభయం.. విలాసవంతమైన ఇళ్లు వదిలి మిలిటరీ బేస్‌లకు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలోని పలువురు కీలక అధికారులు భద్రతా కారణాలతో తమ నివాసాలను మార్చుకుంటున్నారు. ఇరాన్ డర్టీ బాంబు ప్రయోగానికి ప్రయత్నిస్తోందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వారిలో ఆందోళన కలిగించినట్లు సమాచారం. దీంతో విలాసవంతమైన ఇళ్లను వదిలి, సాధారణ ప్రజలకు దూరంగా ఉండే సైనిక స్థావరాల్లో జనరల్స్ కోసం నిర్మించిన నివాసాలకు మారుతున్నారు. ఈ ఇళ్లలో ఉండేందుకు వారు అదనంగా 5 శాతం అద్దె చెల్లిస్తున్నారు. ట్రంప్ కార్యవర్గానికి చెందిన మంత్రులు సహా ఆరుగురు కీలక వ్యక్తులు వాషింగ్టన్ డీసీలోని మిలిటరీ హౌసింగ్‌కు తమ నివాసాలను మార్చుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
రక్షణ, ఆర్థిక మంత్రులూ సైనిక స్థావరాల్లోనే..
ఇరాన్, హూతీల నుంచి బెదిరింపులు పెరగడం, ట్రంప్ కార్యవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని డర్టీ బాంబులు, రసాయన ఆయుధాలతో దాడులు చేసే కుట్రలపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడం ఈ నిర్ణయాలకు కారణాలుగా చెబుతున్నారు.
గత అధ్యక్షుల హయాంలో ఎన్నడూ ఈ స్థాయిలో మంత్రులు, ఉన్నతాధికారులు సైనిక స్థావరాల్లో నివాసం ఉండలేదని సమాచారం. ఇటీవల అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సైనిక స్థావరంలోని నివాసానికి మారడంతో ఈ అంశం వార్తల్లో నిలిచింది.
ఇరాన్ నుంచి ముప్పు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచే చర్యల్లో బెసెంట్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
వివరాలు
తన
ఇరాన్‌పై విడతలవారీగా కఠిన ఆంక్షలు విధించారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా సైనిక స్థావరంలోనే నివసిస్తున్నారు.
ఆయన ఉంటున్న ఫోర్ట్ మెక్నైర్లో గతేడాది మరమ్మతుల కోసం 1.3 లక్షల డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధం కావడం అప్పట్లో వివాదానికి దారితీసింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా తన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నారు.
హెగ్సెత్, రూబియో జనరల్స్ నివాసాల వరుసలో పక్కపక్కనే ఉండటం విశేషం. అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ కూడా సైనిక స్థావరానికి మారారు.
గతంలో అటార్నీ జనరల్‌గా పనిచేసిన పామ్ బాండీ సైతం ఇలాగే అక్కడ నివసించారు.
వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ కూడా మిలిటరీ బేస్‌లోకి మారారు.
వివరాలు
మంత్రులు మిలిటరీ స్థావరాల్లో నివసించవచ్చా?
ఇటీవల ఆయన ఇంటి ఎదుట నిరసనలు జరగడంతో పిల్లలతో కలిసి ఆ ఇంటిని ఖాళీ చేసి సైనిక స్థావరానికి వెళ్లినట్లు సమాచారం.
భద్రతాపరమైన ముప్పు ఎదుర్కొంటున్న పౌర అధికారుల ఇళ్ల వద్ద భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించి, వారికి జీతాలు చెల్లించడం కంటే.. నేరుగా ఆ అధికారులకు సైనిక స్థావరాల్లో నివాసాలు కేటాయించడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదని పెంటగాన్ వాదించింది.
ఈ మేరకు గతంలో చట్టంలో మార్పులు కూడా చేయించింది. ఇలా సైనిక స్థావరాల్లో నివసించే అధికారులు.. ఫోర్స్టార్ జనరల్స్, అడ్మిరల్స్ చెల్లించే అద్దె కంటే 5 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ అద్దె 4,500డాలర్లుగా ఉంది. అయితే పరిస్థితులను బట్టి ఈ అద్దెను మార్చే అవకాశం ఉంది.
వివరాలు
అమెరికా టెక్ కంపెనీలపైనా ఇరాన్ గురి!
ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ పలువురు మంత్రులు సైనిక స్థావరాల్లో నివాసం ఉన్నారు.
మరోవైపు అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, స్పేస్ఎక్స్ ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు సమాచారం.
ఈ మేరకు డ్రోన్లతో ఆయా కంపెనీల కార్యాలయాలపై దాడులు చేస్తున్నట్లుగా చూపించే ఏఐ వీడియోను విడుదల చేసింది.
ఈ సంస్థలు తమపై దాడులకు సహకరిస్తున్నాయని టెహ్రాన్ ఆరోపిస్తోంది.