Mexico: డ్రగ్ మాఫియాలపై ట్రంప్ పోరాటం.. మెక్సికో నుంచి అమెరికాకు 29 మంది నేరస్తుల అప్పగింత
ఈ వార్తాకథనం ఏంటి
పొరుగుదేశమైన మెక్సికో మాదకద్రవ్యాల కేంద్రంగా మారిపోయిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
మెక్సికో నుంచి అమెరికాలోకి మత్తుమందులు అక్రమంగా సరఫరా అయితే అదనపు సుంకాలు విధిస్తానని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ఆ ముఠాల కీలక నాయకులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో మెక్సికోలోని ఎనిమిది నగరాల జైళ్ల నుంచి మొత్తం 29 మంది కరడుగట్టిన మాదకద్రవ్యాల రవాణాదారులను అమెరికా నగరాలకు పంపించిందని మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది.
అమెరికా విధించనున్న 25 శాతం అదనపు సుంకాలను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Details
క్రూరమైన నిందితుల అప్పగింత
తాజాగా అప్పగించిన వారిలో అత్యంత క్రూరమైన నేరస్తుడు రఫెల్ కారో క్వింటెరో కూడా ఉన్నాడు.
1985లో అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) ఏజెంట్ ఎన్రిక్ కికి కమరెనా హత్య కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
అదేవిధంగా మెక్సికోలోని ఆరు ప్రధాన ముఠాల్లో ఐదింటికి చెందిన సభ్యులను ట్రంప్ సర్కారు గ్లోబల్ టెర్రరిస్టులుగా ప్రకటించింది.
అమెరికా అటార్నీ జనరల్ పామెలా బోండీ ఈ విషయంలో స్పందించారు. అమెరికా ప్రజలను ఈ ముఠాల ప్రభావం నుంచి కాపాడేందుకు మా అధికారులు జీవితాంతం శ్రమించారు.
కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ నిందితులను చట్టపరంగా విచారిస్తామని పేర్కొన్నారు.
Details
ముఠా సభ్యులను అమెరికాకు అప్పగింత
మెక్సికో విదేశాంగ మంత్రి జూవాన్ రామన్ డె లామ ఫ్యూంటే అమెరికాలో పర్యటించారు. అనంతరం సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో భేటీ అయ్యారు.
అదే సమయంలో మెక్సికో ఈ ముఠా సభ్యులను అమెరికాకు అప్పగించింది.
ట్రంప్ ప్రభుత్వం మెక్సికోపై మాదకద్రవ్యాల రవాణా నియంత్రణ, అక్రమ వలసదారుల నియంత్రణ, ఫెంటెనిల్ తయారీ నిలిపివేతలపై ఒత్తిడి తీసుకొచ్చింది.
ఈ చర్యల కారణంగా అదనపు సుంకాల విధింపును కొంత సమయం పాటు వాయిదా వేస్తామని అమెరికా ప్రకటించింది.
Details
అమెరికాకు అప్పగింత విషయంలో జాప్యం
కారో క్వింటెరోను అమెరికాకు అప్పగించేందుకు మెక్సికో తొలుత నిరాకరించినా, ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి మారిపోయింది.
ఇతను గ్వాడలనలజర ముఠా నాయకుడు. 2013లో మెక్సికో న్యాయస్థానం ఇతనిపై ఉన్న కేసును కొట్టేయడంతో విడుదల అయ్యాడు.
ఆ తర్వాత మళ్లీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకున్నాడు.
2022లో మరోసారి అరెస్టు అయినా, అమెరికాకు అప్పగింత విషయంలో జాప్యం జరిగింది. అయితే ట్రంప్ కఠినంగా వ్యవహరించడంతో చివరికి మెక్సికో అంగీకరించి ఇతడిని అప్పగించాల్సి వచ్చింది.
Details
మాదకద్రవ్యాల ముఠాలను నిర్మూలించేందుకు చర్యలు
ఈ పరిణామాలతో మెక్సికోపై మాదకద్రవ్యాల కేంద్రంగా ఉన్నదనే ముద్ర మరింత బలపడింది.
మెక్సికో చరిత్రలో ఇంత పెద్ద నేరస్తుల అప్పగింత ఎన్నడూ జరగలేదని, ఇది అమెరికా ఒత్తిడికి లోనై తీసుకున్న నిర్ణయమని మాజీ డీఈఏ చీఫ్ మైక్ విజిల్ తెలిపారు.
మాదకద్రవ్యాల ముఠాలను పూర్తిగా నిర్మూలించేందుకు అమెరికా మరిన్ని చర్యలు తీసుకుంటుందని అంచనా.