Loading...
US-North Korea relations: కిమ్‌కు ట్రంప్ లేఖ.. తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
కిమ్‌కు ట్రంప్ లేఖ.. తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

US-North Korea relations: కిమ్‌కు ట్రంప్ లేఖ.. తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చలు జరపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నానికి స్పందన లభించలేదు. గతేడాది నుంచి కిమ్‌తో మాట్లాడేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉన్న కమ్యూనికేషన్ ఛానళ్లు, ఫోన్ లైన్ల ద్వారా సంప్రదించేందుకు యత్నించినప్పటికీ ఉత్తరకొరియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చివరకు ట్రంప్ స్వయంగా ఓ లేఖ రాసి, దానిని కిమ్‌కు చేరవేయాలని అమెరికా అధికారులకు అందజేశారు. అయితే ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు.

వివరాలు

లేఖను తీసుకెళ్లి.. తిరిగి ఇచ్చేసిన దౌత్యవేత్త

ట్రంప్ లేఖను కిమ్‌కు అందించేందుకు అమెరికా అధికారులు ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి భవనంలో ఉత్తరకొరియా శాశ్వత ప్రతినిధికి ఆ లేఖను అందించాలని భావించారు.

ఈ క్రమంలో అమెరికా అధికారులు ఉత్తరకొరియా కార్యాలయం బయట చాలాసేపు వేచి చూశారు. అటుగా వెళ్తున్న ఓ ఉత్తరకొరియా దౌత్యవేత్తకు చివరకు లేఖను అందజేశారు.

అయితే అతడు ఆ లేఖను తీసుకున్నప్పటికీ.. ఐరాస సమావేశానికి హాజరై తిరిగి వెళ్లే సమయంలో అమెరికా ప్రతినిధుల ఎదురుగా ఉన్న బల్లపై పెట్టి వెళ్లిపోయాడు. కనీసం లేఖపై ఉన్న సీల్‌ను కూడా తెరవకపోవడం గమనార్హం.

ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది.

వివరాలు

ఆసియా పర్యటనలోనూ కిమ్‌తో భేటీకి ప్రయత్నం

ట్రంప్ తన ఆసియా పర్యటన సమయంలోనూ కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే ఉత్తరకొరియా వైపు నుంచి వచ్చిన షరతులు అమెరికాకు ఆమోదయోగ్యంగా లేకపోవడంతో భేటీ సాధ్యం కాలేదు.

దీంతో ట్రంప్ ఎలాంటి ఒప్పందం లేకుండానే తిరిగి అమెరికాకు చేరుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ట్రంప్‌తో చర్చల తర్వాత పెరిగిన అణ్వాయుధ నిల్వలు

2019లో కిమ్ జోంగ్ ఉన్, ట్రంప్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అప్పటి నుంచి ఉత్తరకొరియా అణ్వాయుధాల తయారీని వేగవంతం చేసింది.

2019లో ఆ దేశం వద్ద 20 నుంచి 30 వరకు అణు వార్‌హెడ్‌లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 60కు చేరినట్లు కథనం పేర్కొంది

. గతంలో ఉత్తరకొరియా ప్రధానంగా లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ మోటార్లను ఉపయోగించేది. ఇప్పుడు సాలిడ్ ఫ్యూయల్ రాకెట్లను కూడా సిద్ధం చేసింది.

వీటిని గుర్తించడం అమెరికాకు చాలా కష్టమని కథనం వెల్లడించింది.

ADVERTISEMENT