Donald Trump: ట్రంప్ శాశ్వత మైగ్రేషన్ నిలుపుదల ప్రకటన.. ఎవరికి వర్తిస్తుంది? భారత్ స్థితి ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్ సర్వీస్ సభ్యులపై అఫ్గాన్ మూలాలున్న వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 'తృతీయ ప్రపంచ దేశాల' నుంచి అమెరికాకు వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వరుసగా ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టుల్లో ట్రంప్ గత జో బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీల విషయంలో చాలా కాలంగా మూర్ఖంగా వ్యవహరించిందని మండిపడ్డారు. టెక్నాలజీ ప్రపంచం ఎంత ఎదిగినా... ఇమ్మిగ్రేషన్ విధానాలు ఆ అభివృద్ధిని నాశనం చేశాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Details
తన
'బైడెన్ ప్రభుత్వం అనుమతించిన మిలియన్ల అక్రమ ప్రవేశాలను తక్షణమే రద్దు చేస్తాం. మా దేశానికి ఉపయోగం లేని వారిని, దేశాన్ని ప్రేమించలేని వారిని అమెరికాలో ఉండనివ్వం. ఫెడరల్ బెనిఫిట్లు, సబ్సిడీలను కూడా పౌరసత్వం లేని వారికి నిలిపివేస్తాం. అమెరికా అంతర్గత శాంతిని భంగం చేసే వలసదారుల పౌరసత్వాన్ని రద్దు చేసి, సెక్యూరిటీ రిస్క్‌గా భావించే వారిని దేశం నుంచి పంపిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే 'తృతీయ ప్రపంచ దేశాలు' అంటే ఏ దేశాలను ఉద్దేశిస్తున్నారో ట్రంప్ స్పష్టంగా పేర్కొనలేదు.
Details
'తృతీయ ప్రపంచ దేశం' అనే పదం ఎలా వచ్చింది?
ఈ పదాన్ని మొదట 1952లో ఫ్రెంచ్ డెమోగ్రాఫర్ అల్ఫ్రెడ్ సావీ ప్రవేశపెట్టారు. కోల్డ్ వార్ సమయంలో ప్రపంచాన్ని మూడు వర్గాలుగా విభజించారు. ఫస్ట్ వరల్డ్: అమెరికా - పశ్చిమ మిత్ర దేశాలు సెకండ్ వరల్డ్: సోవియట్ యూనియన్ - కమ్యూనిస్టు మిత్ర దేశాలు థర్డ్ వరల్డ్: ఏ పక్షానికీ కట్టుబడి లేని దేశాలు (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా) ఈ నిర్వచనం ప్రకారం స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా 'థర్డ్ వరల్డ్'లోకి వస్తాయి — ఇది నేటి భావనకు పూర్తిగా విరుద్ధం.
Details
ఆధునిక అర్థం: పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు
1991లో సోవియట్ యూనియన్ పతనంతో పాత రాజకీయ అర్థం లుప్తమైంది. ప్రస్తుతం తృతీయ ప్రపంచం అంటే సాధారణంగా: పేదరికం ఎక్కువగా ఉండే ఆర్థికంగా లేదా రాజకీయంగా అస్థిరంగా ఉన్న పారిశ్రామికీకరణ తక్కువగా ఉన్న దేశాలను సూచించడానికి వాడుతున్నారు. ఈ అర్థం పాత రాజకీయ అర్థంతో పూర్తిగా భిన్నం. అందుకే ఏ దేశాలు అందులోకి వస్తాయన్న దానిపై అపోహలు ఎక్కువగా ఉంటాయి.
Details
'థర్డ్ వరల్డ్' పదంపై విమర్శలు
UN, World Bank వంటి సంస్థలు "తృతీయ ప్రపంచం" పదం బదులుగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు (LDCs) తక్కువ ఆదాయ దేశాలు వంటి వర్గీకరణలను ఉపయోగిస్తున్నాయి.
Details
UN గుర్తించిన తాజాగా అభివృద్ధి చెందిన దేశాలు
2024 నాటికి UN మొత్తం 44 దేశాలను LDCగా గుర్తించింది ఆఫ్రికాలో 32 దేశాలు — అంగోలా, ఇథియోపియా, రువాండా, ఉగాండా, జాంబియా మొదలైనవి ఆసియాలో 8 దేశాలు — అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, యెమెన్ కరీబియన్‌లో 1 దేశం — హైటి పసిఫిక్‌లో 3 దేశాలు — కిరిబాటి, సోలోమన్ దీవులు, తువాలు
Details
భారతదేశం 'థర్డ్ వరల్డ్' జాబితాలో ఉందా?
ఇక్కడే ప్రధాన ప్రశ్న. కోల్డ్ వార్ నిర్వచనం ప్రకారం భారతదేశం 'నాన్ అలైండ్డ్' కాబట్టి, థర్డ్ వరల్డ్ వర్గంలో ఉంటుంది. ఆధునిక ఆర్థిక నిర్వచనం ప్రకారం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం, కానీ LDC కాదు. UN జాబితాలో లేనందున, అత్యల్ప అభివృద్ధి దేశాల కేటగిరీలో పడదు. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (HDI) ప్రకారం 0.685తో 2025 'థర్డ్ వరల్డ్' జాబితాలో ప్రస్తావించింది. గ్లోబల్ సంస్థల అధికారిక వర్గీకరణల ప్రకారం భారత్ LDC లేదని చెప్పొచ్చు. కానీ ట్రంప్ ''తృతీయ ప్రపంచ దేశాలు'' అన్న పదాన్ని ఎలా నిర్వచిస్తారో చెప్పలేదు. అందువల్ల ఆయన వలస నిలుపుదలలో భారత్ ఉంటుందా? లేదా? అన్నది అస్పష్టంగానే ఉంది.