Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. మూడు ప్రముఖ మీడియా సంస్థలపై నిషేధం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటనలు చేశారు. వైట్‌హౌస్‌లోకి సీఎన్‌ఎన్ (CNN), ఎంఎస్ నౌ (MS NOW), పొలిటికో (Politico) వార్తా సంస్థల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. తనపై తప్పుడు, ప్రతికూల వార్తలు ప్రచురిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. భవిష్యత్తులో తనపై ప్రతికూల వార్తలు ప్రచురించే మరిన్ని వార్తా సంస్థలపైనా ఇదే తరహా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరోవైపు గ్రీన్‌లాండ్‌కు సంబంధించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గ్రీన్‌లాండ్ భద్రతకు సంబంధించి డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌లతో అమెరికా శాశ్వత ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.
వివరాలు
అమెరికాకు శాశ్వత నియంత్రణ
ఈ ఒప్పందం ద్వారా గ్రీన్‌లాండ్ భద్రత, ఇతర అవసరాల విషయంలో అమెరికాకు శాశ్వత నియంత్రణ లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
అలాగే అమెరికా అనుమతి లేకుండా తమ ప్రత్యర్థి దేశాలు గ్రీన్‌లాండ్‌లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, సైనిక ఉనికిని కలిగి ఉండటం లేదా సున్నితమైన పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు.
త్వరలోనే గ్రీన్‌లాండ్‌లో భారీ అమెరికా సైనిక ఉనికిని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు.
గ్రీన్‌లాండ్ ప్రజలతో కలిసి అక్కడి అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలను చేపడతామని తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు.
అయితే ఈ ఒప్పందం డెన్మార్క్, గ్రీన్‌లాండ్ పార్లమెంట్ల ఆమోదానికి లోబడి ఉంటుందని సంబంధిత నివేదికలు పేర్కొంటున్నాయి.