Donald Trump: న్యూయార్క్ నుండి ప్రజలు ఫ్లోరిడాకు వెళ్లాల్సి వస్తుంది: ట్రంప్ వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేస్తూ,భారత సంతతికి చెందిన 34 ఏళ్ల యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) న్యూయార్క్ మేయర్ పదవిని గెలుచుకున్నారు. ఆయన విజయం పై ట్రంప్ స్పందించారు. ఎన్నికల తరువాత మమ్దానీ చేసిన ప్రసంగంలో ఆవేశం స్పష్టంగా కనిపించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇంకా, మమ్దానీ కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి అని మళ్లీ ఆరోపిస్తూ, న్యూయార్క్ నగరం క్రమంగా క్యూబా లేదా వెనెజువెలాలాంటి సామ్యవాద దేశాల పరిస్థితిలా మారిపోతుందని విమర్శలు సంధించారు. ఈ నేపథ్యంలో, నగరంలోని ప్రజలు చివరికి ఫ్లోరిడాకు వలస వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
వివరాలు
2030 నాటికి కనీస వేతనాల పెంపు,
"2024 నవంబర్ 5న ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం (తాను అధ్యక్షుడిగా తిరిగి వచ్చానని సూచిస్తూ) దేశ సార్వభౌమత్వం పునరుద్ధరించబడిందని ప్రకటించింది.కానీ న్యూయార్క్ ఎన్నికలతో ఆ సార్వభౌమత్వంలో కొంత కోల్పోయాం. అయినప్పటికీ దాన్ని మేము కాపాడుతాం," అని ట్రంప్ ఫ్లోరిడాలోని మయామి పట్టణంలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరం సమావేశంలో అన్నారు. ఇదిలాఉంటే, మమ్దానీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన హామీలలో సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,నగర అద్దెలను నియంత్రణలోకి తీసుకొచ్చే పథకం, యూనివర్సల్ చైల్డ్ కేర్ అమలు, 2030 నాటికి కనీస వేతనాల పెంపు, అలాగే కార్పొరేట్ కంపెనీలు, ధనవంతులపై అదనపు పన్నులు విధించి సాధారణ ప్రజల జీవన వ్యయాలను తగ్గించడం ఉన్నాయి.
వివరాలు
కమ్యూనిజం కారణంగా నగరం నుండి బయటకు వెళ్లే వారికి మయామి సురక్షిత స్థావరం
ఈ హామీలు ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షించి విజయం అందించాయి. ఈ నేపధ్యంలోనే ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "డెమోక్రాట్లు అమెరికాను ఎటువైపు తీసుకెళ్లాలని చూస్తున్నారో తెలుసుకోవాలంటే న్యూయార్క్‌లో వచ్చిన ఫలితాలు చాలు. అక్కడ వారి పార్టీ ఒక కమ్యూనిస్టును మేయర్‌గా ఎన్నుకుంది. ఇక నుండి కమ్యూనిజం కారణంగా నగరం నుండి బయటకు వెళ్లే వారికి మయామి సురక్షిత స్థావరం అవుతుంది," అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ట్రంప్ పార్టీకి అనుకూల ఫలితాలు రావడం లేదు. పలు రాష్ట్రాల్లో వారి అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారు.
వివరాలు
ప్రతి 10 మందిలో 6 మంది అసంతృప్తి
ఇటీవలి వర్జీనియా, న్యూజెర్సీ పోల్ సర్వేల్లో కూడా, దేశంలో ఏర్పడుతున్న పరిస్థితుల పట్ల ప్రతి 10 మందిలో 6 మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం మూలోొక వంతు మాత్రమే ప్రస్తుత పాలనపై సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాలపై ట్రంప్ ప్రభుత్వ సంఘ బడ్జెట్ విధానం,కేంద్ర ఉద్యోగుల తొలగింపు చర్యలు ప్రభావం చూపినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.