LOADING...
Donald Trump: ఆటోపెన్‌ వివాదం: జో బైడెన్‌ నిర్ణయాలన్నీ చెల్లవంటూ ట్రంప్‌ ప్రకటన
Trump: ఆటోపెన్‌ వివాదం: జో బైడెన్‌ నిర్ణయాలన్నీ చెల్లవంటూ ట్రంప్‌ ప్రకటన

Donald Trump: ఆటోపెన్‌ వివాదం: జో బైడెన్‌ నిర్ణయాలన్నీ చెల్లవంటూ ట్రంప్‌ ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక కీలక ప్రకటన చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ తన పదవీకాలంలో ఆటోపెన్‌ ద్వారా సంతకాలు చేసిన అన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులు ఏవీ చెల్లవని ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. "జో బైడెన్‌ ఆటోపెన్‌తో సంతకం చేసిన పత్రాలు, ఒప్పందాలు, ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు, మెమోరాండమ్స్‌ అన్నీ చెల్లవు. క్షమాభిక్షలు, ప్రయాణ చెల్లింపులు సహా ఆయన సంతకం చేసిన ఏ డాక్యుమెంట్‌కీ చట్టపరమైన విలువ ఉండదు" అని తేల్చిచెప్పారు.

వివరాలు 

బైడెన్‌కు తెలియకుండానే  ఆటోపెన్‌ వినియోగం 

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్‌ బైడెన్‌ ఆటోపెన్‌ వాడకంపై పలుమార్లు ఆరోపణలు చేస్తున్నారు. వైట్‌హౌస్‌ను విడిచిపోయే ముందు బైడెన్‌ జారీ చేసిన అనేక క్షమాభిక్షలు కూడా చెల్లవని గతంలోనే ట్రంప్‌ ప్రకటించారు. ఇదే క్రమంలో, బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిపైనా ఆయన విమర్శలు చేశారు. ఇటీవల బైడెన్‌ ఆటోపెన్‌ సంతకాలతో జారీ చేసిన కొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. సాధారణంగా ఆటోపెన్‌ ఉపయోగించాలంటే అధ్యక్షుడి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, బైడెన్‌కు తెలియకుండానే ఆయన సిబ్బంది ఆటోపెన్‌ను వినియోగించారని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు.

Advertisement