LOADING...
Trump-Putin: పుతిన్ కంటే అక్రమ వలసదారులే పెద్ద ముప్పు.. ట్రంప్ పోస్టు వైరల్
పుతిన్ కంటే అక్రమ వలసదారులే పెద్ద ముప్పు.. ట్రంప్ పోస్టు వైరల్

Trump-Putin: పుతిన్ కంటే అక్రమ వలసదారులే పెద్ద ముప్పు.. ట్రంప్ పోస్టు వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) కంటే అక్రమ వలసదారులే అమెరికాకు పెద్ద ముప్పుగా మారుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్టు ద్వారా వెల్లడించారు. "పుతిన్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న అత్యాచార గ్యాంగులు, మాదకద్రవ్య మాఫియా, హంతకులు, మానసిక స్థితి దెబ్బతిన్న వ్యక్తుల గురించి ఎక్కువగా కేంద్రీకరించాలి. అప్పుడే ఐరోపాలో ఉన్న విధమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉండదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రంప్ చేసిన ట్వీట్