Loading...
Strait of Hormuz: హర్ముజ్ భద్రతపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. దేశాలు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్
హర్ముజ్ భద్రతపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. దేశాలు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్

Strait of Hormuz: హర్ముజ్ భద్రతపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. దేశాలు పరిహారం చెల్లించాలంటూ డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి భద్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జలసంధి భద్రత కోసం అమెరికా చేస్తున్న ఖర్చులను.. దాని వల్ల ప్రయోజనం పొందుతున్న దేశాలు తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతరుల నుంచి ఎలాంటి సహాయం తీసుకోకుండానే హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలకు అమెరికా భద్రత కల్పిస్తోందని ట్రంప్ అన్నారు.

వివరాలు 

ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అవకాశం

''హర్ముజ్ జలసంధి భద్రత కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాల వల్ల అనేక దేశాలు ప్రయోజనం పొందుతున్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత ఆయా దేశాలు అమెరికాకు పరిహారం చెల్లించాలి. ప్రపంచ దేశాలు అమెరికాకు ఎలాంటి సహాయమూ చేయడం లేదు. ఇతర దేశాల ప్రయోజనాల కోసం అమెరికా తనకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది.తరతరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది'' అని ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు,ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.

టెహ్రాన్ త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని,అమెరికా కూడా చర్చలకు సిద్ధంగానే ఉందని ఆయన తెలిపారు.

అయితే తుది నిర్ణయం మాత్రం అమెరికాదేనని స్పష్టం చేశారు.ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని కూడా ట్రంప్ పేర్కొన్నారు.

ADVERTISEMENT