LOADING...
Trump: గాజా యుద్ధం ముగిసింది.. ఇక ఉక్రెయిన్‌-రష్యాపైనే దృష్టి: ట్రంప్‌ 
గాజా యుద్ధం ముగిసింది.. ఇక ఉక్రెయిన్‌-రష్యాపైనే దృష్టి: ట్రంప్

Trump: గాజా యుద్ధం ముగిసింది.. ఇక ఉక్రెయిన్‌-రష్యాపైనే దృష్టి: ట్రంప్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి తెరదించానని, బందీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ప్రస్తుతం ఆయన దృష్టి పూర్తిగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగింపు మీదే కేంద్రీకృతమని తెలిపారు. రష్యాను చర్చల వేదికపైకి రప్పించడానికి ఉక్రెయిన్‌కు లాంగ్‌-రేంజ్‌ ఆయుధాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు. ఉక్రెయిన్‌ సైన్యం రష్యా దాడులను అరికట్టడానికి అమెరికా నుంచి దీర్ఘ శ్రేణి క్షిపణులు అందించాలని చాలా కాలంగా కోరుతోంది. బుధవారం శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు సాధించగలనని విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చల్లో పాల్గొనాలని సూచించారు. లేకపోతే, మరిన్ని ఒత్తిడి చర్యలు తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా హెచ్చరించారు.

వివరాలు 

ఉక్రెయిన్, రష్యా అధినేతలతో పలుమార్లు చర్చలు

మాట వినకపోతే కఠిన ఆంక్షలతో స్పందిస్తామని పరోక్షంగా సంకేతం ఇచ్చారు. గత సంవత్సరం ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, దాదాపు 10 నెలలు గడిచినా, ఆయన ఆ హామీని అమలు చేయలేకపోయారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు.