LOADING...
Bill Pulte: అమెరికా జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక డైరెక్టర్‌గా బిల్ పుల్టే నియామకం
అమెరికా జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక డైరెక్టర్‌గా బిల్ పుల్టే నియామకం

Bill Pulte: అమెరికా జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక డైరెక్టర్‌గా బిల్ పుల్టే నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా జాతీయ నిఘా విభాగం తాత్కాలిక డైరెక్టర్‌గా బిల్ పుల్టేను నియమించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇటీవల ఈ బాధ్యతల నుంచి తులసి గబ్బార్డ్ వైదొలగడంతో ఆమె స్థానంలో పుల్టేకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను సమన్వయం చేసే అత్యంత కీలక విభాగానికి పుల్టేను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ పరిపాలనలో కీలక పదవులకు తనకు అత్యంత విశ్వసనీయులైన వ్యక్తులను ఎంపిక చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం బిల్ పుల్టే తాత్కాలిక డైరెక్టర్‌గా మాత్రమే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన పూర్తిస్థాయి డైరెక్టర్‌గా కొనసాగాలంటే అమెరికా సెనేట్ నుంచి అధికారిక ఆమోదం పొందాల్సి ఉంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రంప్ కీలక నిర్ణయం.. జాతీయ నిఘా విభాగానికి కొత్త తాత్కాలిక అధిపతి

Advertisement