LOADING...
Trump Tariffs: ఫ్రాన్స్ కి ట్రంప్ బెదిరింపు: వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్‌లు
ఫ్రాన్స్ కి ట్రంప్ బెదిరింపు: వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్‌లు

Trump Tariffs: ఫ్రాన్స్ కి ట్రంప్ బెదిరింపు: వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా మిత్రుడా, శత్రువా తేడా లేకుండా వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్నారు. తన లక్ష్యాలను సాధించుకోవడానికి ట్రంప్ టారిఫ్‌లను ఆయుధంగా వాడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని ఆయన బెదిరించారు. గాజా శాంతిమండలిలో చేరాలన్న ట్రంప్‌ ఆహ్వానాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) తిరస్కరించడం.. ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ వైన్, షాంపైన్‌లపై ఈ టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్'లో (Trump Threatens 200 per Tariffs On France) వెల్లడించారు.

వివరాలు 

మెక్రాన్ నుంచి వచ్చిన ప్రైవేట్‌ మెసేజ్‌ షేర్ చేసిన ట్రంప్ 

"నేను ఆయన (మెక్రాన్‌ను ఉద్దేశించి) వైన్లు, షాంపైన్‌లపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తాను. అప్పుడు ఆయన తప్పక శాంతిమండలిలో చేరతారు. అయితే, ప్రస్తుతం ఆయన చేరాల్సిన అవసరం లేదు." అని అమెరికా అధ్యక్షుడు రాసుకొచ్చారు. అలాగే మెక్రాన్ నుంచి వచ్చిన ప్రైవేట్‌ మెసేజ్‌ను షేర్ చేశారు "ఇరాన్, సిరియా విషయంలో మన అభిప్రాయాలు ఏకరూపంగా ఉన్నాయి. కానీ గ్రీన్‌లాండ్ విషయంలో మీరు చేస్తున్న నిర్ణయాలు నాకు అర్థం కావడం లేదు. దావోస్ సమావేశం తర్వాత పారిస్‌లో జీ7 సమావేశం నిర్వహిస్తాను. మీరు యూఎస్‌కు వెళ్లడానికి ముందు ఇద్దరం కలిసి డిన్నర్‌ చేద్దాం'' అని మెక్రాన్ తన సందేశంలో పేర్కొన్నట్టుగా ఉంది.

Advertisement