Donald Trump: కెనడా విక్రయించే విమానాలపై 50శాతం సుంకం: ట్రంప్ వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో వాణిజ్య సంబంధాల విషయంలో ఉద్రిక్తతను పెంచారు. గురువారం ఆయన కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే విమానాలపై 50%సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఇది ట్రంప్,కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో మరింత ప్రాముఖ్యం పొందింది. జార్జియాలోని సవానా కేంద్రంగా ఉన్నగల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్ కంపెనీ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వకుండా నిరాకరించిందని ట్రంప్ ఆరోపించారు. దీనికి ప్రతిగా,కెనడాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బొంబార్డియర్ సహా అన్నికెనడియన్ విమానాల ధృవీకరణలను అమెరికా రద్దు చేస్తామని ఆయన స్పష్టత ఇచ్చారు. ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టులో,"ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే,అమెరికాలో అమ్మే ప్రతి కెనడియన్ విమానంపై 50% సుంకం విధిస్తాను"అని పేర్కొన్నారు.
వివరాలు
ఇప్పటికే కెనడా దిగుమతులపై 100శాతం టారిఫ్ విధిస్తానని బెదిరింపు
అలాగే, గత వారాంతంలో ట్రంప్ చైనా వాణిజ్య ఒప్పందంని సూచిస్తూ, ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100% సుంకం విధిస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, కెనడా ఇప్పటికే ఆ ఒప్పందాన్ని చేసుకున్నందున, ట్రంప్ ఆ సుంకాల గురించి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ట్రంప్ చేసిన హెచ్చరికలపై బొంబార్డియర్ కంపెనీ లేదా కెనడా రవాణా మంత్రిత్వ శాఖ నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు.