LOADING...
747 Jet Gifted by Qatar: ట్రంప్‌కు బహుమతిగా 747 జెట్‌ ఇచ్చిన ఖతార్‌ .. 'ఎగిరే వైట్‌హౌస్‌' అన్న ట్రంప్
ట్రంప్‌కు బహుమతిగా 747 జెట్‌ ఇచ్చిన ఖతార్‌ .. 'ఎగిరే వైట్‌హౌస్‌' అన్న ట్రంప్

747 Jet Gifted by Qatar: ట్రంప్‌కు బహుమతిగా 747 జెట్‌ ఇచ్చిన ఖతార్‌ .. 'ఎగిరే వైట్‌హౌస్‌' అన్న ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఖతార్‌ పాలకులు బహుమతిగా అందించిన 747 జంబో జెట్‌ విమానాన్ని ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఇకపై తన ప్రయాణాల కోసం ఈ విమానాన్ని వినియోగించనున్నట్లు వెల్లడించిన ట్రంప్‌, దీనిని 'ఎగిరే వైట్‌హౌస్‌'గా అభివర్ణించారు. శుక్రవారం జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రత్యేక విమానాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానాల్లో ఇది ఒకటని ట్రంప్‌ కొనియాడారు. విమానం ఇంటీరియర్‌ డిజైన్‌, అత్యాధునిక సదుపాయాలు, ఇంజిన్ల నాణ్యత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.

వివరాలు 

జులై 4 వేడుకల్లో ఆకర్షణగా 'ఫ్లయింగ్‌ వైట్‌హౌస్‌'

ఈ జంబో జెట్‌ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు వినియోగిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ కంటే వేగంగా ప్రయాణించడమే కాకుండా, ఎక్కువ దూరాన్ని నిరవధికంగా చేరుకోగల సామర్థ్యం కలిగి ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ అరుదైన కానుక అందించిన ఖతార్‌ పాలకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే జులై 4న నిర్వహించనున్న ప్రత్యేక వేడుకల్లో జరిగే విమానాల ప్రదర్శనలో ఈ విలాసవంతమైన జెట్‌ కూడా పాల్గొనే అవకాశముందని ట్రంప్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా,ఈ విమానం అంతర్గత నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇందులో విలాసవంతమైన లెదర్‌ సీట్లు,బంగారు వర్ణపు అలంకరణలతో కూడిన లేత గోధుమరంగు గోడలు,అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Advertisement