Page Loader
Donald Trump: USలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టే వారికి వేగంగా అనుమతులు.. ట్రంప్ 
USలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టే వారికి వేగంగా అనుమతులు.. ట్రంప్

Donald Trump: USలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టే వారికి వేగంగా అనుమతులు.. ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్, మరికొన్ని రోజుల్లో తన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, పెట్టుబడిదారుల కోసం ట్రంప్ ఓ భారీ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో 1 బిలియన్ డాలర్లు (రూ.8489 కోట్లు) పెట్టుబడి పెట్టినవారికి వేగంగా అనుమతులు ఇవ్వడం వంటివి త్వరగా మంజూరు చేయాలని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ''అమెరికాలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన వారికి శరవేగంగా అనుమతులు మంజూరు చేస్తాను. పర్యావరణ అనుమతులు కూడా వెంటనే ఇస్తాను'' అని పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదన అద్భుతంగా ఉందని, దీనిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా మద్దతు తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

వివరాలు 

ట్రంప్ ప్రతిపాదనలు పర్యావరణ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు

అమెరికా నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ పాలసీ యాక్ట్ (NEPA) ప్రకారం, ఏ కంపెనీకి అనుమతులు ఇవ్వేముందు పర్యావరణ ప్రభావాలు కూడా పరిశీలించాలి. అయితే, ట్రంప్ ప్రతిపాదనలు పర్యావరణ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. అవి ఎన్ఈపీఏ నిబంధనలను ఉల్లంఘించడమేనని, చట్టవిరుద్ధమైనవని, వీటివల్ల దేశంలో కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని వాషింగ్టన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్‌ యాక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ హెచ్చరించారు. దీంతో, ట్రంప్ ఇలాంటి ఆఫర్ల ద్వారా అమెరికాను కార్పొరేట్ బిడ్డర్లకు విక్రయించేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శలు వినిపించాయి.