LOADING...
Trump: 'సమయం మించిపోతోంది.. లేకపోతే మీకు ఏమీ మిగలదు'.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
'సమయం మించిపోతోంది.. లేకపోతే మీకు ఏమీ మిగలదు'.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Trump: 'సమయం మించిపోతోంది.. లేకపోతే మీకు ఏమీ మిగలదు'.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులకు దిగే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఉద్రిక్తతను పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వరుసగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజీ చర్చలకు ఇరాన్‌కు ఎక్కువ సమయం లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరగా నిర్ణయం తీసుకోకపోతే చివరకు ఇరాన్‌కు ఏమీ మిగలదని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్ సోషల్'లో వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక

వివరాలు 

దేశంలో ఒకే ఒక్క అణు రియాక్టర్ మాత్రమే పనిచేయాలని షరతు

ఇదే సమయంలో అమెరికా ప్రతిపాదించిన సంధి షరతులపై ఇరాన్ మీడియా కీలక కథనం ప్రచురించింది. ఇరాన్ వద్ద నిల్వలో ఉన్న 400 కిలోల శుద్ధి చేసిన యూరేనియంను తమకు అప్పగించాలని అమెరికా కోరినట్టు తెలిపింది. అలాగే దేశంలో ఒకే ఒక్క అణు రియాక్టర్ మాత్రమే పనిచేయాలని షరతు పెట్టినట్టు పేర్కొంది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం కోరరాదని కూడా అమెరికా స్పష్టం చేసినట్టు సమాచారం. విదేశాల్లో నిల్వలో ఉన్న ఇరాన్ నిధులను విడుదల చేసే ఉద్దేశం తమకు లేదని కూడా అమెరికా తెలిపినట్టు కథనాలు వెల్లడించాయి.

Advertisement

వివరాలు 

అమెరికా ముందు కొన్ని కీలక డిమాండ్లు ఉంచిన ఇరాన్ 

మరోవైపు చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ కూడా కొన్ని కీలక డిమాండ్లు ముందుంచింది. లెబనాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న అన్ని దాడులను పూర్తిగా నిలిపివేయాలని కోరింది. హోర్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమ హక్కులను అమెరికా గుర్తించాలని డిమాండ్ చేసింది. విదేశాల్లో నిల్వలో ఉన్న తమ ఆస్తులపై విధించిన ఆంక్షలను తొలగించాలని, యుద్ధం కారణంగా కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా ఇరాన్ పట్టుబడుతోంది.

Advertisement

వివరాలు 

ఇరాన్‌లో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నాలు 

ఇక ఇరాన్‌లో అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఆరోపించారు. దేశంలో ఉగ్రవాద శక్తులను ప్రోత్సహిస్తూ అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే పొరుగుదేశాలు ఇందుకు సహకరించకపోవడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇరాక్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement