LOADING...
Donald Trump: ఇరాన్‌ దిశగా మరిన్ని యుద్ధనౌకలు.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..
ఇరాన్‌ దిశగా మరిన్ని యుద్ధనౌకలు.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..

Donald Trump: ఇరాన్‌ దిశగా మరిన్ని యుద్ధనౌకలు.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశం వైపు మరిన్ని యుద్ధనౌకలు కదులుతున్నాయని ఆయన వెల్లడించారు. అయితే వాటిని వినియోగించే పరిస్థితి రాకూడదని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియా ప్రాంతానికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు యుద్ధనౌకలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. "ప్రస్తుతం మరో శక్తివంతమైన యుద్ధనౌక ఇరాన్ దిశగా ప్రయాణిస్తోంది.వారు ఒక ఒప్పందానికి రావాలని ఆశిస్తున్నాం.నిజానికి ఇది ముందే జరగాల్సింది.అయినప్పటికీ వారు దీనికి సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు.ఈ విషయమై వారు నాకు పలుమార్లు ఫోన్ చేశారు"అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న ఆందోళన

ఇదే సమయంలో ఈ ప్రాంతానికి అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను తరలిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. మరోవైపు, ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో చోటుచేసుకున్న ఘర్షణల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అబ్రహం లింకన్ వాహక నౌకతో పాటు పలు అమెరికా యుద్ధనౌకలను పశ్చిమాసియాలో మోహరించారు. దీంతో ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న ఆందోళన అంతర్జాతీయంగా పెరిగింది.

Advertisement