Trump Warns Iran: ఇరాన్‌పై ట్రంప్ ఆర్థిక యుద్ధం.. భారత్ ఎగుమతులపై ప్రభావం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు కొనసాగుతున్న వేళ.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంపైనా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు. ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేయడమే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. ఇరాన్‌కు ఆర్థికంగా అండగా నిలిచే దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌పై ప్రభావం ఎంత ఉంటుంది? ఇరాన్‌తో మన దేశానికి ఉన్న వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం
ఇరాన్‌పై ఇప్పటివరకు ఏ దేశంపైనా ప్రకటించని స్థాయిలో అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యలను చేపట్టనున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్‌కు తాను ఎంతో పెద్ద అవకాశం ఇచ్చానని, అయితే ఆ అవకాశాన్ని టెహ్రాన్ సద్వినియోగం చేసుకోలేకపోయిందని పేర్కొన్నారు.
దీంతో ఇరాన్‌పై ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌ను పూర్తిగా ఒంటరి చేయడమే అమెరికా లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇప్పటికే ఇరాన్ నౌకాదళం తీవ్రంగా దెబ్బతిన్నదని, వాయుసేన ధ్వంసమైందని, సైనిక కర్మాగారాలు శిథిలమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా ఇరాన్ కరెన్సీ విలువ కూడా భారీగా పడిపోయిందని చెప్పారు. ఇకపై ఆ దేశం ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
వివరాలు
ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం
ఇరాన్‌కు ఆర్థిక సహకారం అందించే దేశాలపై కూడా చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఏదైనా దేశానికి చెందిన ఆర్థిక సంస్థలు,వ్యాపార సంస్థలు,విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ సంస్థలు ఇరాన్‌కు ఆర్థికంగా జీవనాధారం కల్పిస్తే.. ఆయా దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
చమురు అక్రమ రవాణా,నగదు బదిలీలు,ఎక్స్ఛేంజ్ హౌస్‌లు,షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీల ద్వారా ఇరాన్‌కు సహకారం అందించే వ్యవస్థలను వెంటనే నిలిపివేయాలని ట్రంప్ పేర్కొన్నారు.
ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నవారు ఎవరన్నది అందరికీ తెలుసని అన్నారు.
ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు, ఆ దేశాన్ని ఏకాకిని చేసి ఓడించేందుకు అమెరికా మిత్రదేశాలన్నీ తమతో కలిసి నిలవాలని పిలుపునిచ్చారు.
ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు.
వివరాలు
భారత్‌పై ప్రభావం ఉంటుందా?
ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలన్నింటికీ ట్రంప్ హెచ్చరికలు వర్తించే అవకాశం ఉంది.
ఈనేపథ్యంలో ఇరాన్‌కు కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్‌పైనా ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారత్-ఇరాన్ మధ్య ప్రస్తుతం మిగులు వాణిజ్యం కొనసాగుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు కొంత తగ్గాయి.
అయినప్పటికీ ట్రంప్ తన హెచ్చరికలకు అనుగుణంగా ఆంక్షలు లేదా ఇతర ఆర్థిక చర్యలు తీసుకుంటే భారత ఎగుమతిదారులకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయ గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఇరాన్‌కు 1.25బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి.
వివరాలు
భారత్‌పై ప్రభావం ఉంటుందా?
అదే కాలంలో ఇరాన్ నుంచి భారత్ 370 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.
అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత్-ఇరాన్ వాణిజ్య పరిమాణం చాలా తక్కువగా ఉంది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య మొత్తం వాణిజ్యం 17.03 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఇందులో భారత్ చేసిన దిగుమతుల విలువ 13.53 బిలియన్ డాలర్లు కాగా.. మన దేశం నుంచి ఇరాన్‌కు జరిగిన ఎగుమతుల విలువ 3.51 బిలియన్ డాలర్లు.
ఆ తర్వాతి సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు గణనీయంగా తగ్గాయి.
అందువల్ల ట్రంప్ ఇరాన్‌పై ఆర్థిక చర్యలను మరింత కఠినతరం చేసినప్పటికీ.. ప్రస్తుతం భారత్‌పై పడే ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
భారత్-ఇరాన్ మధ్య ఎలాంటి వాణిజ్యం జరుగుతోంది?
భారత్-ఇరాన్ సంబంధాలు కేవలం చమురు వ్యాపారానికే పరిమితం కాలేదు.
ఇరాన్ మార్కెట్‌కు భారత్ నుంచి అనేక రకాల వ్యవసాయ, ఔషధ, ఆహార ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
ముఖ్యంగా బాస్మతీ బియ్యం, తేయాకు, చక్కెర, తాజా పండ్లు, ఔషధాలు, మసాలాలు, ఇతర ఆహార ఉత్పత్తులను భారత్ ఇరాన్‌కు పంపుతోంది.
అదే సమయంలో ఇరాన్ నుంచి భారత్‌కు పిస్తా, ఖర్జూరాలు, యాపిల్స్, కివీ వంటి పండ్లు, ఇతర ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి.
దీంతో రెండు దేశాల మధ్య వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల వాణిజ్యానికి కూడా ప్రాధాన్యం ఉంది.
వివరాలు
భారత్-ఇరాన్ మధ్య ఎలాంటి వాణిజ్యం జరుగుతోంది?
ఒకవేళ ట్రంప్ ప్రకటించిన ఆర్థిక చర్యలు కఠినంగా అమలైతే.. ఇరాన్‌తో వ్యాపారం చేసే భారత కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తులను ఇరాన్‌కు ఎగుమతి చేసే భారత వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు.
అయితే ప్రస్తుత వాణిజ్య పరిమాణం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినందున.. భారత్‌పై మొత్తం ప్రభావం ఎంతమేర ఉంటుందనేది అమెరికా తీసుకునే తదుపరి చర్యలపై ఆధారపడి ఉంటుంది.