LOADING...
Trump: చర్చలు రాకపోతే ఇరాన్‌పై 'భీకర స్థాయి' దాడి: ట్రంప్
చర్చలు రాకపోతే ఇరాన్‌పై 'భీకర స్థాయి' దాడి: ట్రంప్

Trump: చర్చలు రాకపోతే ఇరాన్‌పై 'భీకర స్థాయి' దాడి: ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

అణు ఒప్పందంపై చర్చలకు ముందుకు రాకపోతే ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అణు ఆయుధాల నిషేధానికి సంబంధించిన ఒప్పందం అందరికీ ప్రయోజనకరమని, ఇందుకోసం ఇరాన్‌ తక్షణమే చర్చల టేబుల్‌కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. భారీ యుద్ధ నౌకలు స్పష్టమైన లక్ష్యంతో, అత్యంత వేగంగా ఇరాన్‌ దిశగా కదులుతున్నాయని పేర్కొంటూ, సమయం వృథా చేయకుండా ఒప్పందం కుదుర్చుకోవాలని మరోసారి సూచించారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్‌ తన 'ట్రూత్‌ సోషల్‌' ఖాతా ద్వారా వెల్లడించారు. ఒకవేళ ఇరాన్‌ చర్చలకు దూరంగా ఉంటే, గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు.

వివరాలు 

గట్టిగా స్పందించిన ఇరాన్ 

ఇదిలా ఉండగా, అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతోందన్న సంకేతాలు కనిపించడంతో ఇరాన్‌ ప్రాంతీయ మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇరాన్‌పై దాడి జరిగితే అమెరికాకు తమ గగన మార్గాన్ని ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వబోమని సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు స్పష్టం చేసినట్లు సమాచారం. ట్రంప్‌ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఇరాన్‌ కూడా గట్టిగా స్పందించింది. తమను యుద్ధంలోకి నెట్టే ప్రయత్నం జరిగితే, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అయితే చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని కూడా ఇరాన్‌ ప్రకటించింది.

Advertisement