Trump: ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక.. 'ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది'
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరాన్‌పై ఒత్తిడిని తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. ట్రంప్ ప్రకారం,పికాక్స్ పర్వతం కింద ఉన్న రహస్య భూగర్భ కేంద్రంలో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమెరికా వద్ద సమాచారం ఉందన్నారు. ఇరాన్ మరోసారి అణ్వాయుధాల తయారీ దిశగా అడుగులు వేయకుండా ఆ కేంద్రాన్నిపూర్తిగా ధ్వంసం చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన దాడులు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు చర్యలు ఇంకా ముందున్నాయని వ్యాఖ్యానించారు.
వివరాలు
యురేనియంపై అమెరికా ఆందోళన
ఇరాన్ వద్ద ప్రస్తుతం దాదాపు వెయ్యి పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు.
ఆ యురేనియాన్ని వినియోగిస్తూ పికాక్స్ పర్వతం కింద అణు కార్యకలాపాలను కొనసాగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
ఆ కేంద్రాన్ని ధ్వంసం చేయడంతో పాటు యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైతే త్వరలోనే సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించారు.
యుద్ధం ఇదే విధంగా కొనసాగితే ఇరాన్‌లో భారీ స్థాయిలో విధ్వంసం సంభవించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.
వివరాలు
ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా దాడులు
ఇదిలా ఉండగా, ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.
ఆపరేషన్ సెంటర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కొన్ని పౌర నివాస ప్రాంతాలపై అమెరికా బాంబు దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు.
అలాగే చాబహార్ పోర్టును లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి క్షిపణి దాడులు చేసినట్లు సమాచారం.
మరోవైపు, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఖతార్, కువైట్, బహ్రెయిన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతున్నట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
మునీర్‌కు మొజ్తబా ఖమేనీ రహస్య సందేశం
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఇరాన్ మంత్రి మొమేనీ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌తో రావల్పిండిలో దాదాపు 50 నిమిషాలపాటు సమావేశమయ్యారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ పంపిన రహస్య సందేశాన్ని మునీర్‌కు అందజేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
యుద్ధానికి 37.5 బిలియన్ డాలర్ల వ్యయం
ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి దాదాపు 37.5 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.3.6 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు.
ఇందులో సెప్టెంబర్ 30 వరకు అయ్యే అంచనా వ్యయాలు కూడా ఉన్నాయని తెలిపారు.
పెంటగాన్‌కు అదనంగా సుమారు 67 బిలియన్ డాలర్ల నిధులు అవసరమని చేసిన అభ్యర్థన నేపథ్యంలో ఈ వ్యయ వివరాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు.