Page Loader
Turkey: తుర్కియే అసలు రంగు బయటపడింది.. స్నేహాన్ని మరిచి ద్రోహానికి దిగింది! 
తుర్కియే అసలు రంగు బయటపడింది.. స్నేహాన్ని మరిచి ద్రోహానికి దిగింది!

Turkey: తుర్కియే అసలు రంగు బయటపడింది.. స్నేహాన్ని మరిచి ద్రోహానికి దిగింది! 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం చేసిన ఉపకారాన్ని తుర్కియే మరిచిపోయింది. తాజాగా భారత్‌పై ద్రోహానికి పాల్పడుతోందని తేలింది. 2023లో తుర్కియేలో సంభవించిన భయంకర భూకంప సమయంలో ప్రపంచంలోనే ముందుగా సహాయం ప్రకటించిన దేశం భారత్‌. 'ఆపరేషన్‌ దోస్త్‌' పేరుతో మన దేశం భారీ మానవతా సహాయాన్ని అందించింది. భాధితులకు తక్షణ సహాయంగా ఆహారం, మందులు పంపడమే కాకుండా.. ప్రత్యేకంగా కిసాన్‌ డ్రోన్లను పంపింది. మానవత్వాన్ని చూపిన దేశం మీద ఇప్పుడు తుర్కియేనే తిరుగబడి పాక్‌కు డ్రోన్లను అందించినట్లు సమాచారం.

Details

పాకిస్థాన్ డ్రోన్ దాడుల వెనుక తుర్కియే హస్తం

గురువారం పాకిస్తాన్‌ భారతదేశంపై భారీగా డ్రోన్ దాడులు చేసింది. అంచనాల ప్రకారం దాదాపు 300-400 డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత్‌ విజయవంతంగా కూల్చివేసింది. ఈ డ్రోన్ల శకలాలను ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షించగా, అవన్నీ తుర్కియేకు చెందిన 'అసిస్‌ గార్డ్‌ సోనగర్‌' తయారీ డ్రోన్లు అని స్పష్టం చేశారు. ఇది తుర్కియే రాష్ట్రపతి ఎర్డోగాన్‌ ప్రభుత్వ నిత్య వైరం కలిగి ఉన్న మానసికతను తిరిగి చూపిస్తోంది. భారత్‌పై ద్వేషాన్ని ఎప్పటికప్పుడు బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చిన ఎర్డోగాన్‌ ఇప్పుడు ఆ ద్వేషాన్ని కార్యరూపం దాల్చేలా చేశారు.

Details

పహల్గాం దాడి తర్వాత కుట్ర మొదలైందా?

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌పై భారత్‌ ప్రతీకార దాడులకు దిగుతుందన్న ఊహనపై ముందుగానే స్పందించిన తుర్కియే, వ్యూహాత్మకంగా పాక్‌కు మద్దతుగా నిలిచింది. ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంటే, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ మాత్రం పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను కలుసుకుని మద్దతు ప్రకటించారు. పహల్గాం ఘటనపై ఖండన గానీ, బాధిత కుటుంబాలకు సానుభూతి గానీ ప్రకటించలేదు.

Details

తుర్కియే పాకిస్తాన్‌కు రహస్య మద్దతు

గత నెల 28న తుర్కియేకు చెందిన 'C-130E హెర్క్యూలస్‌' మిలటరీ విమానం పాకిస్థాన్‌లో ల్యాండ్‌ కావడం, పాక్‌ గగనతల నిఘా సంస్థల చేత గుర్తించారు. తాత్కాలికంగా ఇంధనం నింపేందుకు వచ్చామని చెప్పిన తుర్కియే, దానికితోడు ఓ యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్ట్‌కు పంపింది. ఇదంతా రహస్యంగా జరిగినా, ఆ మద్దతుతో భారత్‌పై పాకిస్థాన్‌ ప్రయోగిస్తున్న ఆయుధాల వెనుక తుర్కియే ప్రమేయం ఉన్నదని నిపుణులు అంటున్నారు.

Details

మద్దతు చెప్పినవారు తక్కువే..

పహల్గాం ఘటన తర్వాత ప్రపంచ దేశాల మద్దతు భారత్‌కు లభించినా, ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్‌బైజాన్‌ మాత్రమే పాక్‌కు బహిరంగ మద్దతు ప్రకటించాయి. అంతేకాదు, గతంలో కశ్మీర్‌ అంశంపై కూడా ఎర్డోగాన్‌ అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.