Loading...
Turkish military aircraft: పాక్‌కు టర్కీ సైనిక విమానాల వరుస రాకపోకలు.. ఏం తరలించారు?
పాక్‌కు టర్కీ సైనిక విమానాల వరుస రాకపోకలు.. ఏం తరలించారు?

Turkish military aircraft: పాక్‌కు టర్కీ సైనిక విమానాల వరుస రాకపోకలు.. ఏం తరలించారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టర్కీకి చెందిన భారీ సైనిక రవాణా విమానాలు వరుసగా పాకిస్థాన్‌కు చేరుకుని, కొద్దిసేపటికే తిరిగి వెళ్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 19 నుంచి 21 వరకు టర్కీకి చెందిన పలు విమానాలు నిరంతరంగా పాకిస్తాన్‌కు రాకపోకలు సాగించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా టర్కీకి చెందిన సీ-130 హెర్క్యులెస్ రవాణా విమానాలు రావల్పిండిలోని నుర్ ఖాన్ ఎయిర్‌బేస్, కరాచీలోని మస్రూర్ ఎయిర్‌బేస్‌ల మధ్య పలుమార్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

రహస్య రవాణా వెనుక అసలు కథ!

ఈ అనుమానాస్పద విమాన రాకపోకలపై ఇప్పటివరకు టర్కీ, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే రక్షణ రంగానికి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. పాకిస్తాన్ తన వైమానిక సామర్థ్యాలను, రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా టర్కీ నుంచి భారీగా సైనిక సామగ్రిని సమకూర్చుకుంటున్నట్లు సమాచారం.

ముఖ్యంగా టర్కీ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బేరాక్టర్ టీబీ2 డ్రోన్లు, ఇతర రక్షణ వ్యవస్థలను ఈ విమానాల ద్వారా పాకిస్తాన్‌కు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది.

బేరాక్టర్ టీబీ2 మధ్యస్థ శ్రేణికి చెందిన మానవరహిత యుద్ధ డ్రోన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ బలగాలు రష్యా రక్షణ, క్షిపణి వ్యవస్థలపై దాడులకు ఈ డ్రోన్లను విస్తృతంగా ఉపయోగించాయి

వివరాలు 

'ఇస్లామిక్ నాటో' వ్యూహంలో భాగమేనా?

దీంతో పాకిస్తాన్‌కు వీటి సరఫరా జరుగుతోందనే వార్తలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన త్రైపాక్షిక సైనిక ఒప్పందం కూడా ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తోంది.

రక్షణ రంగ నిపుణుల్లో కొందరు ఈ ఒప్పందాన్ని 'ఇస్లామిక్ నాటో'గా అభివర్ణిస్తున్నారు.

యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా రక్షణపరమైన అవసరాలు తలెత్తినప్పుడు మూడు దేశాలు పరస్పరం సైనిక సహకారం అందించుకోవడం ఈ ఒప్పందంలోని ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వయంగా ఈ ఆయుధ దిగుమతుల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు రక్షణ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది.

అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ మాత్రం వెలువడలేదు.

ADVERTISEMENT

వివరాలు 

'ఇస్లామిక్ నాటో' వ్యూహంలో భాగమేనా?

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రహస్యంగా టర్కీ నుంచి డ్రోన్లు, ఇతర రక్షణ సామగ్రిని సమకూర్చుకుంటున్నట్లయితే.. దాని ప్రభావం దక్షిణాసియా భద్రతా సమీకరణాలపై ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.

పాక్‌ సైనిక సామర్థ్యం పెరగడం ప్రాంతీయ శక్తుల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT