Kathmandu: ఖాట్మండు ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. మంటల్లో చిక్కుకున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. టర్కిష్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఇస్తాంబుల్ నుంచి ఖాట్మండుకు చేరుకుంటున్న సమయంలో ల్యాండింగ్ సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారుల వివరాల ప్రకారం, TK726 కాల్‌సైన్‌తో ప్రయాణిస్తున్న ఈ విమానం ఇస్తాంబుల్ నుంచి ఖాట్మండుకు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం కుడివైపు టైర్ల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అత్యవసర చర్యలు చేపట్టిన అధికారులు ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు.
వివరాలు
విమానంలో మొత్తం 278 మంది ప్రయాణికులు
ఈ ఘటనపై విమానాశ్రయ భద్రతా విభాగం అధికారి రాజ్‌కుమార్ సిలావాల్ స్పందిస్తూ.. "విమానం ల్యాండింగ్ సమయంలో టైర్లకు మంటలు అంటుకున్నాయి. ఫైర్ ఇంజిన్ల సహాయంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. అందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. విమానంలో మొత్తం 278 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో కొంతమంది ఐక్యరాజ్యసమితి (United Nations) అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాలు
కుడివైపు ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు
విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో కుడివైపు ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు చెలరేగి, దట్టమైన పొగ కమ్ముకున్న దృశ్యాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. అనంతరం అత్యవసర ద్వారాల ద్వారా ప్రయాణికులను బయటకు తరలించారు. అయితే ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై విమానాశ్రయ అధికారులు, అలాగే టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరలవుతున్న వీడియో
त्रिभुवन अन्तर्राष्ट्रिय विमानस्थलमा आज बिहान अवतरणको क्रममा टर्किस एयरलाइन्सको जहाजमा देखिएको आगो । #foryoupageシ #nepaltext #highlight pic.twitter.com/skc0ZAj5fL
— कफी कुमार (@sarojshree) May 11, 2026