LOADING...
Iran: ఫోన్‌ ఆఫ్‌ చేసి నిద్రపోండి.. ట్రంప్‌కు ఇరాన్‌ కౌంటర్
ఫోన్‌ ఆఫ్‌ చేసి నిద్రపోండి.. ట్రంప్‌కు ఇరాన్‌ కౌంటర్

Iran: ఫోన్‌ ఆఫ్‌ చేసి నిద్రపోండి.. ట్రంప్‌కు ఇరాన్‌ కౌంటర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 18, 2026
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా చేస్తున్న ప్రకటనలపై ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఫోన్‌ పక్కనపెట్టి, 'బీబీ'గా పిలిచే బెంజమిన్ నెతన్యాహును బ్లాక్‌ చేయాలంటూ సెటైర్లు వేసింది. హర్మూజ్‌ హోర్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచేందుకు టెహ్రాన్‌ అంగీకరించిందని ట్రంప్‌ పేర్కొంటూ, దీన్ని ప్రపంచానికి గొప్ప రోజుగా అభివర్ణించారు. దీనిపై జింబాబ్వేలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం స్పందిస్తూ ట్రంప్‌పై చురకలు వేసింది. "మీరు మరీ సంతోషంగా ఉన్నట్లు చూపించుకోకండి.. హుందాగా వ్యవహరించండి" అంటూ ఎక్స్‌ పోస్టులో వ్యాఖ్యానించింది.

వివరాలు

తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటాం 

హర్మూజ్‌ జలసంధి, అలాగే ఇరాన్‌లో పాలన మార్పు వంటి ఊహాగానాలను ఇకపై పక్కన పెట్టాలని సూచించింది. తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది. అలాగే ట్రంప్‌కు ఫోన్‌ ఆఫ్‌ చేసి విశ్రాంతి తీసుకోవాలని, బీబీని వారం రోజుల పాటు బ్లాక్‌ చేయాలని వ్యంగ్యంగా సూచించింది. తేలికైన భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోవాలని కూడా సెటైర్‌ వేసింది. ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్‌ మధ్య ఏప్రిల్‌ 20న మరోసారి చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబులు వేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. బుధవారంలోగా ఒప్పందం కుదుర్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు.

Advertisement