Canada: కెనడాలో కాల్పులు.. భారత సంతతికి చెందిన ఇద్దరు టీనేజర్లు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
May 13, 2026
09:05 am
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలోని సర్రే నగరంలో దారుణ కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యూటన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో భారత సంతతికి చెందిన ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వయస్సులు 16, 18 సంవత్సరాలుగా పోలీసులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం మే 10 రాత్రి సుమారు 10 గంటల సమయంలో 133బి వీధిలోని 7000 బ్లాక్ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడిఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
సంఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి
అత్యవసర వైద్య సిబ్బంది వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సంఘటనా స్థలంలోనే ఇద్దరూ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సర్రే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.