NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / వర్జీనియా: గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి 
    తదుపరి వార్తా కథనం
    వర్జీనియా: గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి 
    వర్జీనియా: గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి

    వర్జీనియా: గ్రాడ్యుయేషన్ వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Jun 07, 2023
    10:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.

    వేడుక వెలుపల గుంపుపై దుండగుడు ఏకంగా నాలుగు తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించాడు.

    ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

    వర్జీనియా కామన్వెల్త్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని థియేటర్‌లో హ్యూగెనాట్ హైస్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో ఈ ఘటన జరగ్గా, నిందితుడిని వెంటనే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    నిందితుడి వయసు 19 ఏళ్లు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడిపై ఇతర నేరాలతో పాటు సెకండ్-డిగ్రీ హత్యకు సంబంధించి రెండు అభియోగాలు మోపే అవకాశం ఉందని తాత్కాలిక రిచ్‌మండ్ పోలీస్ చీఫ్ రిక్ ఎడ్వర్డ్స్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

    తుపాకీ కాల్పులు

    ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని షూటర్ కాల్పులు

    వాస్తవానికి ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని షూటర్ కాల్పులు జరిపినట్లు పోలీస్ చీఫ్ ఎడ్వర్డ్స్ తెలిపారు. ఇదొక పిరికి చర్యగా ఆయన అభివర్ణించారు.

    మృతులు 18, 36 సంవత్సరాల వయస్సు గల పురుషులని పోలీస్ చీఫ్ చెప్పారు.

    ఈ గందరగోళంలో 9ఏళ్ల బాలికను కారు ఢీకొట్టింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

    చివరికి నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

    పాఠశాలలు, షాపింగ్ కేంద్రాలు, చర్చిలు వంటి బహిరంగ ప్రదేశాల్లో సామూహిక కాల్పులు అమెరికాలో సర్వసాధారంగా జరుగుతుంటాయి.

    గన్ వాయిలెన్స్ ఆర్చీవ్ ప్రకారం 2023లో 157 రోజుల్లోనే దేశంలో ఇది 279వ సామూహిక కాల్పులు కావడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాకీ కాల్పులు
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    తుపాకీ కాల్పులు

    అమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    టెక్సాస్‌ షాపింగ్ మాల్‌లో కాల్పులు; ఒకరు మృతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అమెరికా: మిస్సిస్సిప్పిలో తుపాకీ గర్జన; ఆరుగురు మృతి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    సిడ్నీ: ఆస్ట్రేలియాలో పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి ఆస్ట్రేలియా

    తాజా వార్తలు

    బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    వేలాది ఐఫోన్‌లు హ్యాకింగ్‌; అమెరికా, యాపిల్‌పై రష్యా సంచలన ఆరోపణలు  ఐఫోన్
    'సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం' ఇదే మా నినాదం: కేసీఆర్  తెలంగాణ
    మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి  మణిపూర్

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    బద్దలైన అగ్నిపర్వతం; గ్రామాలను కప్పేసిన బూడిద; ఎగిసిపడుతున్న లావా  రష్యా
    జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి అమెరికా
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025