Page Loader
NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం
నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం

NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు డొనాల్డ్ ట్రంప్‌ తన పాలకవర్గంలో అనేక నియామకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆనియామకాలలో ఒకటిగా, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తదుపరి చీఫ్‌గా బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మెన్‌ను నామినేట్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఐజాక్‌మెన్‌ స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్ మస్క్‌ సహచరుడిగా ఉన్నాడు. అయితే తాజాగా ట్రంప్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. గతంలో ఐజాక్‌మెన్‌కు సంబంధించిన ఇతర సంస్థలతో ఉన్న సంబంధాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చానని ట్రంప్‌ తెలిపారు. త్వరలో నాసాకు కొత్త చీఫ్‌ నామినీని ప్రకటించనున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగావెల్లడించాడు. ఈ విషయంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం నుండి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.

Details

పదవి నుంచి తప్పుకున్న మస్క్

ఈ నేపథ్యంలో, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్ మస్క్‌ స్పందించి, నాసాకు నాయకత్వం వహించడానికి జేర్డ్ ఐజాక్‌మెన్‌ వంటి సమర్థుడైన, మంచి మనసున్న వ్యక్తి దొరకడం చాలా అరుదని అన్నారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన ఎలాన్ మస్క్‌ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కీలక పాత్రను పోషించాడు. ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించే దిశగా 'డోజ్' అనే శాఖను ఏర్పాటు చేసి, ఆ బాధ్యతలు మస్క్‌కి అప్పగించారు. అయితే ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్‌'కు నిరసనగా మస్క్‌ తన పదవిని నుంచి వైదొలిగాడని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదే కారణంగా ట్రంప్‌ సన్నిహితుడైన జేర్డ్ ఐజాక్‌మెన్‌ నామినేషన్‌ను ట్రంప్ ఉపసంహరించడం చర్చనీయాంశమైంది.