
UK: యూకేలో ఇద్దరు సిక్కు వృద్ధులపై దాడి..ముగ్గురు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ కింగ్డమ్ లో (UK) చోటుచేసుకున్న జాత్యహంకార దాడి కలకలం రేపుతోంది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు దాడికి గురవ్వగా, సంబంధం ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపిన వివరాల ప్రకారం,ఆగస్టు 15న యూకేలోని వోల్వర్‌హాంప్టన్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఇద్దరు సిక్కులకు ముగ్గురు యువకులు దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. యూకేలో నివసిస్తున్న సిక్కు వలసదారుల భద్రతపై దృష్టి పెట్టాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరినట్లు తెలిపారు.
వివరాలు
జాత్యహంకార చర్యలను అసలు సహించం: పోలీసులు
అంతేకాదు, బాధితులకు న్యాయం జరిగేలా స్థానిక పోలీసులను కూడా ఆయన అభ్యర్థించారు. పోలీసులు ఈ సంఘటనపై స్పందిస్తూ, ఇలాంటి జాత్యహంకార చర్యలను అసలు సహించబోమని స్పష్టం చేశారు. ఘటనలో పాల్గొన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని తెలిపారు. అయితే అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై యూకే పార్లమెంట్ సభ్యురాలు సురీనా బ్రాకెన్‌రిడ్జ్ కూడా స్పందించారు. ఆమె ఈ దాడిని ఖండిస్తూ, సంబంధిత నివేదికలను తక్షణం సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. అలాగే వోల్వర్‌హాంప్టన్ ప్రజలు ఐక్యంగా ఉండి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
I strongly condemn the horrific attack on two elderly Sikh men in Wolverhampton, UK, during the course of which one Sikh’s turban was removed forcibly.
— Sukhbir Singh Badal (@officeofssbadal) August 18, 2025
▪️This racist hate crime targets the Sikh community, which always seeks Sarbat Da Bhala (the well-being of all).
▪️Known for… pic.twitter.com/5G0DJbZbBs