డిస్పోసబుల్ పెన్ను వివాదంలో బ్రిటన్ ప్రధాని.. దస్త్రాలపై అదే పెన్నుతో సునక్ సంతకాలు
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ మరో వివాదంలో చిక్కుకుపోయారు. ఓ పెన్నుపై వస్తున్న ఆరోపణల మేరకు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సునక్ నిత్యం ఏదో ఒక అంశంలో విమర్శలకు గురవుతున్నారు.
గతంలో సునాక్ ఛాన్సలర్‌గా ఉన్న సమయంలోనూ డిస్పోజబుల్ 'పైలట్ వి' పెన్నులను ఉపయోగించారు.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇప్పటికీ అధికారిక దస్తావేజులపైనా అవే పెన్నులతో సంతకాలు చేస్తుండటం పట్ల ఇంగ్లీష్ దేశంలో దుమారం రేగుతోంది.
ఈ క్రమంలో 15 రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలోనూ సునాక్ చేతిలో ఈ పెన్ను కనిపించడం గమనార్హం.
DETAILS
సునాక్ ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు : మీడియా సెక్రటరీ
ఇటీవలే మాల్డోవాలో ఐరోపా రాజకీయ సదస్సు జరిగింది. ఆ సమావేశానికి హాజరైన సునక్, అధికారిక పత్రాలపైనా ఇదే పెన్నుతో సంతకాలు చేశారు.
ఈ నేపథ్యంలో సదరు పెన్నుపై విమర్శలు పెరిగిపోయాయి. డిస్పోసబుల్ పెన్నుతో రాసినవి తుడిచేసే వీలు ఉండటంతో భద్రతాపరంగా సురక్షితం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని ది గార్డియన్ అనే పత్రిక వెల్లడించింది.
దీనిపై 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికార వర్గాలు స్పందించాయి. తనకు సంబంధించిన అన్ని పత్రాలను ప్రధాని భద్రంగా ఉంచుకుంటారని వెల్లడించాయి.
ఈ పెన్నును సివిల్ సర్వీస్‌ల్లోనూ వినియోగిస్తున్నారని,సునక్ ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని, ఇకపైనా చేయబోరని ప్రధాని మీడియా సెక్రటరీ తెలిపారు.
బ్రిటన్‌లో ఈ పెన్ను ధర 4.75 పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.495గా తెలుస్తోంది.