LOADING...
UK: బ్రిటన్‌ వీసా ఫీజులు పెంపు.. విద్యార్థులు, పర్యాటకులపై అదనపు భారం
బ్రిటన్‌ వీసా ఫీజులు పెంపు.. విద్యార్థులు, పర్యాటకులపై అదనపు భారం

UK: బ్రిటన్‌ వీసా ఫీజులు పెంపు.. విద్యార్థులు, పర్యాటకులపై అదనపు భారం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2026
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌కు పర్యటనల కోసం వెళ్లేవారితో పాటు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులపై ఇకపై మరింత ఆర్థిక భారం పడనుంది. స్టూడెంట్‌, విజిటర్‌ సహా అన్ని వర్గాల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. వీసాలు, సెటిల్మెంట్‌, స్పాన్సర్‌ లైసెన్స్‌లకు సంబంధించిన కొత్త ఛార్జీలు ఏప్రిల్‌ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు హోమ్‌ ఆఫీస్‌ వెల్లడించింది. దరఖాస్తు రుసుములు సుమారు 6నుంచి 7శాతం వరకు పెరగనున్నాయని పేర్కొంది.కొత్త నిబంధనల ప్రకారం మూడేళ్ల స్కిల్డ్‌ వర్కర్‌ వీసా దరఖాస్తు ఫీజు 769పౌండ్ల నుంచి 819పౌండ్లకు పెరగనుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1,02,470గా ఉంటుంది. అలాగే మూడేళ్లకు మించిన గడువు ఉన్న వీసా దరఖాస్తుల ఫీజు 1519పౌండ్ల నుంచి 1618 పౌండ్లకు పెరుగుతుంది.

వివరాలు 

135 పౌండ్లకు పెరగనున్న ఆరు నెలల విజిటర్‌ వీసా

దీని విలువ భారత కరెన్సీలో సుమారు రూ.2,02,437గా ఉంటుంది. ఈ పెంపు విద్యార్థి వీసాలపైనా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం 524 పౌండ్లుగా ఉన్న విద్యార్థి వీసా ఫీజు 558 పౌండ్లకు పెరగనుంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.69,814 అవుతుంది. మరోవైపు, ఆరు నెలల విజిటర్‌ వీసా ఛార్జీ 127 పౌండ్ల నుంచి 135 పౌండ్లకు పెరుగుతుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.16,890 అవుతుంది. అదేవిధంగా స్పాన్సర్‌ లైసెన్స్‌, ఈటీఏ (ETA) ఛార్జీలను కూడా సవరించినట్లు బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త ఫీజుల అమలుతో బ్రిటన్‌కు వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు, పర్యాటకులు అదనపు ఖర్చును భరించాల్సి రానుంది.

Advertisement