Russia: వాయవ్య రష్యాలో కీలక ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి.. హైప్రెజర్ పైప్‌లైన్లు ధ్వంసం
ఈ వార్తాకథనం ఏంటి
వాయవ్య రష్యాలో కీలకమైన ఎరువుల ఉత్పత్తి కేంద్రం ఫోస్ అగ్రోపై ఉక్రెయిన్ డ్రోన్లతో మరోసారి దాడి చేసింది. ఏప్రిల్ నెలలో ఈ ప్లాంట్‌పై జరిగిన రెండో దాడి ఇదే కావడం గమనార్హం. రష్యా కీలక ఎగుమతి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఉక్రెయిన్ దాడులు తీవ్రతరం చేసింది. తాజా దాడిలో ప్లాంట్‌లోని సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను పంప్ చేసే హై ప్రెజర్ పైప్‌లైన్లు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని వోలోగ్డా గవర్నర్ జార్జి ఫలిమొనోవ్ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో మంటలు లేదా రసాయన లీకేజీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
ఎరువుల దిగుమతులపై ఆంక్షలు
వెంటనే మరమ్మతులు చేపట్టడంతో ప్రమాదకర గ్యాస్‌లు బయటకు రాలేదని వెల్లడించారు. ఇక ప్లాంట్ ప్రతినిధులు ఈ దాడిపై స్పందించడానికి నిరాకరించారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఎరువుల మార్కెట్‌పై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నైట్రోజన్ ఫర్టిలైజర్ ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా గొలుసు కూడా దెబ్బతింది. దీంతో రష్యా, చైనా దేశాలు ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి ఫాస్ఫరస్ ఆధారిత ఎరువులను భారత్‌కు ఎగుమతి చేసే ప్రధాన సంస్థల్లో ఫోస్ అగ్రో కూడా ఒకటిగా ఉంది.