Zelensky: ఉక్రెయిన్‌కు రష్యా నుంచి 1,358 బందీల విడుదల.. జెలెన్‌స్కీ ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది ఉక్రెయిన్‌కు చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్‌స్కీ తెలిపారు.
ఈ ప్రక్రియలో ఉక్రెయిన్ అధికారులు ఎంతో కష్టపడినట్లు ఆయన పేర్కొన్నారు. 2025 కొత్త సంవత్సరంలోనూ ఇలాంటి శుభవార్తలు రావాలని ఆశిస్తున్నానని, ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన పోస్ట్ చేశారు.
రష్యా వద్ద బందీలుగా ఉన్న సైనికులు, పౌరుల విడుదలలో మిత్ర దేశాలు కీలక పాత్ర పోషించాయని జెలెన్‌స్కీ వెల్లడించారు.
రష్యాతో కొనసాగుతున్న యుద్ధం ఈ ఏడాదిలోనే ముగియాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
Details
యుద్ధం ముగిసే అవకాశం
2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఈ యుద్ధంలో 30,000 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మరణించారని, భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని సమాచారం.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు చేపడతారని జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ చర్చించి ఈ యుద్ధాన్ని ముగిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్, పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు.