
Ukraine: జపోరిజ్జియాలో ఇంధనం రవాణా చేస్తున్న రష్యన్ రైలును పేల్చిన ఉక్రెయిన్ దళాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ సైన్యం మంగళవారం జపోరిజ్జియా ప్రాంతంలో రష్యా ఇంధన రైలును ధ్వంసం చేసింది. ఈ ఘటన వీడియోలను పెట్రో ఆండ్ర్యూషెంకో షేర్ చేశారు. దాడి తరువాత రైల్వే లైన్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి ఉరోజ్‌హాయ్నీ,టోక్‌మాక్ ప్రాంతాల మధ్య జరిగింది. ప్రస్తుతానికి ఉక్రెయిన్ లేదా రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు. దాడి ఎలా జరిగిందో ఇంకా తెలియదు. ఇది ఉక్రెయిన్ చేసిన మొదటి రైలు దాడి కాదు. మే నెలలో కూడా ఉక్రెయిన్ డ్రోన్లు ఇంధన రైల్ ట్రైన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. జపోరిజ్జియాలో రష్యా సైన్యం కొన్ని ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకుంది. ఈ దాడి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ట్రంప్, యూరోపియన్ నేతలతో వైట్ హౌస్‌లో సమావేశమైన తర్వాత జరిగింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపోరిజ్జియా ప్రాంతంలో రష్యా ఇంధన ట్రైన్ ధ్వంసం
Ukraine destroyed russian train with fuel on occupied territories. Just look at that fire 🔥😏 pic.twitter.com/oh0TuXToHN
— Kate from Kharkiv (@BohuslavskaKate) August 19, 2025