
జెల్‌న్ స్కీ ఇంటి ముందరే నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
ఈ వార్తాకథనం ఏంటి
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇటీవల ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన తర్వాత నాటు నాటు పాటకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అందులో ఎన్టీఆర్, రాంచరణ్ వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అయిపోయారు. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు ఈ పాటకు స్టెప్పులేశారు.
అదే విధంగా ఇటీవల జమ్ముకాశ్మీర్ నిర్వహించిన జీ20 సదస్సు వేదికపై ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. 2021లో రాజమౌళి ఒరిజినల్ సాంగ్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్‌స్కీ నివాసం ఎదుట చిత్రీకరించారు.
Details
రష్యాకు వ్యతిరేకంగా నాటు నాటు పాటను చిత్రీకరించిన ఉక్రెయిన్ ఆర్మీ
తాజాగా అదే చోట ఈ పాటకు ఉక్రెయిన్ ఆర్మీ స్టెప్పులేసింది. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ఆర్మీ ఆ పాటను తీశారు.
ఆ పాటలో రాంచరణ్, ఎన్టీఆర్ బ్రిటిష్ అధికారికి వ్యతిరేకంగా ఎలా అయితే నిరసస తెలిపారో అలా రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్ ఆర్మీ ఆ పాటను చిత్రీకరించింది. ఈ పాటలో ఉక్రెయిన్ ఆర్మీ డాన్స్ తో పాటు డ్రోన్స్ ఎగరేస్తున్నట్లు చూపించారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఉక్రెయిన్ నెటిజన్లు తాము స్వంత వలసవాదులతో పోరాడుతున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు ఆరులక్షలకు పైగా వ్యూక్, లైక్స్ రావడం విశేషం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాటునాటు పాటకు డాన్స్ వేసిన ఉక్రెయిన్ ఆర్మీ
Військові з Миколаєва зняли пародію на пісню #NaatuNaatu з 🇮🇳 фільму "RRR", головний саундтрек якого виграв Оскар цього року.
— Jane_fedotova🇺🇦 (@jane_fedotova) May 29, 2023
У оригінальній сцені гол.герої піснею виражають протест проти британського офіцера (колонізатора) за те, що він не пустив їх на зустріч. pic.twitter.com/bVbfwdjfj1