UN Medal of Honour: 550 మంది భారత బ్లూ హెల్మెట్‌లకు ఐరాస గౌరవ పతకాలు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో శాంతి పరిరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న భారత బలగాలకు ఐరాస గౌరవ పతకాలు ప్రదానం చేసింది. ఘర్షణల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దేశంలో పౌరుల రక్షణతో పాటు శాంతి స్థాపన కోసం విశేషంగా కృషి చేస్తున్న భారత శాంతి దళాల సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులు అందజేసింది. సౌత్ సూడాన్‌లోని మలకల్ నగరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పతకాలను ప్రదానం చేశారు.
వివరాలు
464 మంది రువాండా శాంతి సిబ్బందికీ పతకాలు
ఐరాస మిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, 53 మంది మహిళలు సహా మొత్తం 565 మంది భారత 'బ్లూ హెల్మెట్' శాంతి పరిరక్షకులకు ఈ గౌరవం లభించింది. అలాగే 464 మంది రువాండా శాంతి సిబ్బందికీ పతకాలు అందించారు. పౌరులకు భద్రత కల్పించడం, మానవతా సహాయం అందేలా చర్యలు తీసుకోవడం,వైద్య శిబిరాలు నిర్వహించడం,మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వడం వంటి సేవలకు గుర్తింపుగా ఐరాస ఈ పురస్కారాలను అందించింది.