Page Loader
US: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు.. చికాగో విమానాశ్రయంలో విమానం నిలిపివేత 
US: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు.. చికాగో విమానాశ్రయంలో విమానం నిలిపివేత

US: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు.. చికాగో విమానాశ్రయంలో విమానం నిలిపివేత 

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2024
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం చికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయింది. విమానంలోని ఒక ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. విమానం రెక్కల నుంచి పొగలు రావడంతో ఈ ఘటన కెమెరాలో నిక్షిప్తమైంది. యునైటెడ్ ఫ్లైట్ 2091 మధ్యాహ్నం 2 గంటలకు సియాటిల్‌కు బయలుదేరాల్సి ఉండగా మంటలు చెలరేగాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వేర్వేరుగా టాక్సీవేలో ఈ సంఘటన జరిగిందని నివేదించాయి. దీంతో విమానం నుండి 148 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందిని ఖాళీ చేయించారు.

Details 

ప్రయాణికుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌

ఈ ఘటనపై విమానంలో కూర్చున్న ఓ ప్రయాణికుడు వీడియో తీయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ప్రయాణికుడు కూడా ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. "నా కిటికీ నుండి నేను చూస్తున్నప్పుడు ఇంజన్ కి మంటలు అంటుకుని, పొగలు వస్తున్నాయి" అని అతను చెప్పాడు. ఈ సంఘటన కారణంగా FAA విమానాశ్రయానికి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. సాధారణ కార్యకలాపాలు మధ్యాహ్నం 2:45 గంటలకు తిరిగి ప్రారంభమయ్యాయి.

Details 

తుఫాను కారణంగా  నిలిచిపోయిన కార్యకలాపాలు  

ఎలాంటి గాయాలు అయినట్లు నివేదికలు లేవని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇంజిన్ సమస్యలు వెంటనే పరిష్కరించమని తెలిపింది. "ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తున్నాము" అని విమానయాన సంస్థ తెలిపింది. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లోని జెఎఫ్‌కె అంతర్జాతీయ విమానాశ్రయంలో చికాగో ప్రయాణీకులే కాకుండా ఇతర ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుఫాను కారణంగా సోమవారం ఇక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..