LOADING...
United Health Care: యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ హత్య 
యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ హత్య

United Health Care: యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ హత్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2024
09:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూయార్క్‌లో దారుణ ఘటన జరిగింది. అమెరికాలోని ప్రముఖ ఇన్సూరెన్స్‌ సంస్థ యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ దారుణ హత్యకు గురయ్యారు. మిడ్‌టౌన్‌లో ఉన్న హిల్టన్‌ హోటల్‌ సమీపంలో బుధవారం ఉదయం ఒక దుండగుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ముఖానికి మాస్క్‌ ధరించిన దుండగుడు, బ్రియాన్‌ను టార్గెట్‌ చేసి ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. బ్రియాన్‌ అదే హోటల్‌లో జరుగుతున్న ఇన్వెస్టర్‌ డే కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉందని యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌ సీఈవో ఆండ్రూ విట్టీ వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యునైటెడ్ హెల్త్‌కేర్ CEO బ్రియాన్ థాంప్సన్ దారుణ హత్య