LOADING...
'Good actors': ట్రంప్‌ నిర్ణయానికి భారత్‌ సహకారం.. అందుకే చమురు కొనుగోలుకు మినహాయింపు: వైట్‌హౌస్
అందుకే చమురు కొనుగోలుకు మినహాయింపు: వైట్‌హౌస్

'Good actors': ట్రంప్‌ నిర్ణయానికి భారత్‌ సహకారం.. అందుకే చమురు కొనుగోలుకు మినహాయింపు: వైట్‌హౌస్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో రష్యా నుంచి చమురు (Russian oil) కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా (USA) తాత్కాలిక మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ (Karoline Leavitt) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉన్న కొందరు సన్నిహిత మిత్రుల కారణంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశానికి రష్యా చమురు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారని ఆమె వెల్లడించారు.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఏర్పడుతున్న సమస్యలను తగ్గించేందుకు అమెరికా చర్యలు

కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడుతూ, గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని ట్రంప్‌ సూచించిన వెంటనే భారత్‌ (India) ఆ నిర్ణయాన్ని అమలు చేసిందని తెలిపారు. అందువల్లే అవసరమైన సమయంలో భారత్‌ను ఇబ్బందిపెట్టకుండా చమురు కొనుగోలుకు తాత్కాలిక అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సముద్రంలో ఇప్పటికే ప్రయాణంలో ఉన్న రష్యా ముడి చమురును భారత్‌ కొనుగోలు చేసినా, దాంతో మాస్కోకు పెద్దగా ఆర్థిక లాభం ఉండదని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా ఇరాన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఏర్పడుతున్న సమస్యలను తగ్గించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోందని కూడా కరోలిన్‌ లీవిట్‌ పేర్కొన్నారు.

Advertisement