
సిరియా స్థావరాలను పేల్చేసిన అమెరికా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదని స్పష్టం
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికా రెండు సిరియా స్థావరాలను పేల్చేసింది.ఈ మేరకు పెంటగాన్ ప్రధాన కార్యాలయం ప్రకటించింది.
ఇరాన్ బలగాల దాడుల నేపథ్యంలో అమెరికా రెండు సిరియన్ స్థావరాలపై దాడి చేసింది. ఈ క్రమంలోనే సిరియాలో,ఇరాన్, సిరియన్ సంయుక్త దళాలపై దాడులు జరిగాయి.
దీంతో అమెరికన్ దళాలపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రధాన కార్యాలయం శ్వేతసౌధం నుంచి ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీకి హెచ్చరికలు అందాయి.
గత వారంలో ఇరాక్, సిరియాలో 12 మంది అమెరికన్ దళాలపై ఇరాన్, సిరియా దళాలు దెబ్బతిశాయి.దీంతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అగ్రరాజ్యం హెచ్చరించింది.
ఈ నేపథ్యంలోనే ఇరాక్, సిరియాలోని బలగాలపై సమయం చూసుకుని ప్రతిదాడులు చేస్తామని అమెరికా ముందే వార్నింగ్ ఇచ్చింది.
details
అమెరికా రక్షణ దళాలు ఖచ్చితమైన ఆత్మరక్షణ దాడులకు దిగాయి : లాయిడ్ ఆస్టిన్
ఇదే సమయంలో సిరియాపై తాజా దాడులకు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఎటువంటి సంబంధం లేదని యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సహా అనుబంధ గ్రూపులు ఉపయోగించే తూర్పు సిరియాలోని రెండు స్థావరాలపై అమెరికా సైన్యం దాడి చేసిందని గురువారం ఆ దేశ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ స్పష్టం చేశారు.
అక్టోబర్ 17న ఇరాన్ మద్దతుగల మిలీషియా గ్రూపులు, ఇరాక్, సిరియాలో యూఎస్ సిబ్బందిపై దాడులు చేశాయని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఆయా దాడులకు ప్రతిస్పందనగా ఖచ్చితమైన ఆత్మరక్షణ దాడులు జరిగాయన్నారు.
దాడుల్లో అమెరికా పౌరుడు,కాంట్రాక్టర్ గుండెపోటుతో మరణించాడని, 21 సిబ్బందికి చిన్నపాటి గాయాలయ్యాయన్నారు. తర్వాత అందరూ తిరిగి విధుల్లో చేరారన్నారు.