Page Loader
USA: యూదు వ్యతిరేక నిరసనలు.. పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్ రాజీనామా..
USA: యూదు వ్యతిరేక నిరసలు.. పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్ రాజీనామా..

USA: యూదు వ్యతిరేక నిరసనలు.. పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్ రాజీనామా..

వ్రాసిన వారు Stalin
Dec 10, 2023
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ లిజ్ మాగిల్‌ తన పదవికి రాజీనామా చేశారు. కళాశాల క్యాంపస్‌లలో పెరుగుతున్న యూదు వ్యతిరేకత నిరసన నేపథ్యంలో లిజ్ మాగిల్‌ పదవి నుంచి వైదొలిగారు. ప్రెసిడెంట్‌ పదవి నుంచి వైదొలిగిన తర్వాత యూనివర్శిటీ కేరీ లా స్కూల్‌ ఫ్యాకల్టీ మెంబర్‌గా మాగిల్ కొనసాగుతారని, తదుపరి అధ్యక్షుడిని నియమించే వరకు ఆమె అధ్యక్ష పదవి బాధ్యతలు నిర్వహిస్తారని విశ్వవిద్యాలయం పేర్కొంది. క్యాంపస్‌లలో యూదు వ్యతిరేకతపై నిరసనలు ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో క్యాంపస్‌లో యూదులను ఊచకోత కోయాలని కొందరు పిలుపునిచ్చారు. యూదు వ్యతిరేకతపై నిరసనలపై అమెరికా కాంగ్రెస్ మందు మాగిల్ హాజరయ్యారు. కాంగ్రెస్ ఎదుట మాగిల్ సరైన వివరణ ఇవ్వకపోవడంతో రాజీనామా చేయాలని ఒత్తి వచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 లిజ్ మాగిల్‌ రాజీనామా