Loading...
Dan Driscoll: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా ఆర్మీ సెక్రటరీ డ్యాన్‌ డ్రిస్కోల్‌ రాజీనామా
ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా ఆర్మీ సెక్రటరీ డ్యాన్‌ డ్రిస్కోల్‌ రాజీనామా

Dan Driscoll: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా ఆర్మీ సెక్రటరీ డ్యాన్‌ డ్రిస్కోల్‌ రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా రక్షణ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆర్మీ సెక్రటరీ డ్యాన్‌ డ్రిస్కోల్‌ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిసి ఆర్మీ ప్రస్తుత పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించిన అనంతరం ఆయన రాజీనామా లేఖను సమర్పించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ పరిణామాన్ని వైట్‌హౌస్‌ కూడా ధ్రువీకరించింది. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఆర్మీ అత్యున్నత పౌర అధికారి పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. డ్రిస్కోల్‌ రాజీనామా అమెరికా సైనిక నాయకత్వంలో మరో కీలక మార్పుగా నిలిచింది.

వివరాలు 

రాజీనామాకు కారణాలేంటి?

డ్యాన్‌ డ్రిస్కోల్‌ రాజీనామా వెనుక అమెరికా రక్షణ శాఖలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరే ప్రధాన కారణమని సమాచారం.

రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌తో డ్రిస్కోల్‌కు గత కొన్ని నెలలుగా పలు అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

ముఖ్యంగా ఆర్మీ ఉన్నతాధికారుల తొలగింపులు, సైనిక నాయకత్వంలో మార్పులు, ఆర్మీ ఆధునికీకరణ వంటి అంశాలపై ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

హెగ్‌సెత్‌ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆర్మీని ఆధునికీకరించే ప్రయత్నాలకు ఆటంకంగా మారుతున్నాయని డ్రిస్కోల్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

వివరాలు 

రాజీనామాకు కారణాలేంటి?

ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ ర్యాండీ జార్జ్‌ తొలగింపు కూడా ఇద్దరి మధ్య విభేదాలను మరింత తీవ్రం చేసిన అంశాల్లో ఒకటిగా వార్తలు వచ్చాయి.

జార్జ్‌,డ్రిస్కోల్‌ కలిసి ఆర్మీ ఆధునికీకరణ, డ్రోన్లు, మానవరహిత వ్యవస్థల వినియోగంపై పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు.

ఈ విషయంలోనూ హెగ్‌సెత్‌ నిర్ణయాలతో డ్రిస్కోల్‌కు భేదాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం.

అధికార పరిధులు, సైనిక నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే విధానం, ఉన్నతాధికారుల నియామకాలు, ఆర్మీ భవిష్యత్‌ దిశ వంటి అంశాలపై హెగ్‌సెత్‌, డ్రిస్కోల్‌ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

చివరకు ఈ విభేదాలే డ్రిస్కోల్‌ పదవి నుంచి తప్పుకోవడానికి దారితీశాయని సమాచారం. అయితే వైట్‌హౌస్‌ మాత్రం ఆయన రాజీనామాకు నిర్దిష్ట కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

ADVERTISEMENT