తదుపరి వార్తా కథనం

US- china trade deal: టారిఫ్ వార్‌కు తాత్కాలిక విరామం.. 90 రోజుల సమయం ఇచ్చిన అమెరికా, చైనా
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 12, 2025
01:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, చైనా మధ్య టారిఫ్ ల సుంకాల ప్రకటనలతో ప్రపంచ దేశాలు, స్టాక్ మార్కెట్లు తీవ్ర అవగాహనలో పడి ఉన్న సమయంలో, ఇద్దరు దేశాలు చివరకు ఒక అవగాహనకు వచ్చాయి.
అమెరికా, చైనా పోటాపోటీగా విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఈ మేరకు తమ టారిఫ్‌లను 115 శాతం వరకు తగ్గించుకుంటామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు.
ఈ నిర్ణయం స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా వెలువడింది. 90 రోజుల కాలపరిమితిలో ఈ టారిఫ్ తగ్గింపులు అమలు అవుతాయని అధికారులు తెలిపారు.