అమెరికాకు రష్యా వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు మద్దతుపై భగ్గుమన్న పుతిన్.. రష్యన్ల సపోర్ట్ వారికేనట
ఇజ్రాయెల్‌లో భీకర పరిస్థితుల నేపథ్యంలో వేలాది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా తాజా పరిస్థితులకు అమెరికా పాలసీనే వైఫల్యమన్నారు. స్వతంత్ర సార్వభౌమ పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. పాలస్తీనా స్వతంత్ర ఆవశ్యకతను అమెరికా విస్మరించిందన్నారు. అమెరికా విధానాల వైఫల్యానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని, దీనిపై చాలా మంది ప్రజలు నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారన్నారు. శాంతి నెలకొల్పే క్రమంలో అంతర్జాతీయ ప్రయత్నాలకు, US ఆధిపత్యం వహించేందుకు యత్నిస్తోందన్నారు. ఇరువర్గాలతో రాజీ కుదుర్చడంలో వాషింగ్టన్ నిర్లక్ష్యం ఉందని, వివాదాన్ని రష్యా పరిష్కరిస్తుందన్నారు. ఓవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తూనే మరోవైపు పుతిన్ పాలస్తీనాకు అండగా నిలబడటం గమనార్హం.