Page Loader
అమెరికా: నల్లజాతీయులే లక్ష్యంగా కాల్పులు.. ముగ్గురు మృతి
అమెరికా: నల్లజాతీయులే లక్ష్యంగా కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికా: నల్లజాతీయులే లక్ష్యంగా కాల్పులు.. ముగ్గురు మృతి

వ్రాసిన వారు Stalin
Aug 27, 2023
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని ఓ తెల్లజాతీయుడు ముగ్గురు నల్లజాతీయులను కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలోని ఓ స్టోర్‌లో చోటుచేసుకుంది. కాల్పులు జరిగిన ప్రదేశానికి నల్లజాతీయులు ఎక్కువగా చదివే ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీ చాలా సమీపంలోనే ఉంటుంది. కాల్పులు జరిపిన వ్యక్తి ముందురోజు క్యాంపస్‌లోనే ఉన్నాడని, కానీ ఎవరికీ ఎటువంటి హాని చేయలేదన్నదని ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. జాతి వివక్షతోనే దుండగుడు కాల్పులు జరిపినట్లు, దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జాతి వివక్షతో నల్లజాతీయులపై కాల్పులు