Chikungunya First Vaccine : చికున్‌గున్యా వైరస్‌కు అమెరికా చెక్.. తొలి టీకాకు అగ్రరాజ్యం గ్రీన్ సిగ్నల్
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను బయటపెడుతూ వస్తున్న చికున్ గున్యా వైరస్‌కు అమెరికా చెక్ పెట్టింది. ఈ మేరకు తొలిసారిగా ఈ వైరస్ ను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ను ఆమోదించింది. ఫలితంగా చికున్‌గున్యా జ్వరాల వ్యాప్తికి ముగింపు రానుంది. చికున్ గున్యా వైరస్ కారణంగా జ్వరాలు, తీవ్ర కీళ్ల నొప్పుల లక్షణాలు రోగులను ఇబ్బందులకు గురి చేస్తాయి.ఇక ఆయా ఇక్కట్లకు అమెరికా చెక్ పెట్టడంతో వైరస్ బాధితులకు ఉపశమనం లభించనుంది. ఈ మేరకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చికున్‌గున్యా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. వైరస్ కు వ్యతిరేకంగా టీకాను ఆమోదించినట్లు అమెరికా ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
దోమల వల్లే చికున్ గున్యా వైరస్ వ్యాప్తి
దోమల కారణంగా వ్యాపించే చికున్ గున్యా వైరస్ పై తొలి వ్యాక్సిన్‌కు యూఎస్ ఆరోగ్య అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చికున్‌గున్యా వైరస్ కొత్త భౌగోళిక ప్రాంతాలకు వ్యాపిస్తున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి ఎక్కువగా ప్రచారం అయ్యిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. గడిచిన 15 ఏళ్లలో 5 మిలియన్లకుపైగా రోగులు ఈ చికున్ గున్యా బారిన పడటం గమనార్హం. చికున్‌గున్యా వైరస్ ఇన్‌ఫెక్షన్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణంగా నిలుస్తుందని ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. వృద్ధుల్లో ఎక్కువగా ఈ వైరస్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సీనియర్ ఎఫ్‌డీఏ (food And drug administration) అధికారి పీటర్ మార్క్స్ చెప్పారు.