LOADING...
US-Iran Talks: హర్ముజ్ ఉద్రిక్తతల నడుమ అమెరికా-ఇరాన్ మరో విడత చర్చల సంకేతాలు
హర్ముజ్ ఉద్రిక్తతల నడుమ అమెరికా-ఇరాన్ మరో విడత చర్చల సంకేతాలు

US-Iran Talks: హర్ముజ్ ఉద్రిక్తతల నడుమ అమెరికా-ఇరాన్ మరో విడత చర్చల సంకేతాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు ఫలితం లేకుండా ముగిసిన నేపథ్యంలో మరో ముఖ్యమైన ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెనీవా వేదికగా త్వరలో రెండో విడత చర్చలు జరగనున్నాయని సమాచారం వెలువడుతోంది. ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ దిశగా పరోక్ష సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో సీజ్‌ ఫైర్‌ ఒప్పందం నడుస్తోంది అయితే హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేయడం వల్ల అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివరాలు 

యుద్ధ పరిస్థితులపై స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు

ఇరాన్ పోర్టుల వైపు వెళ్లే అమెరికా నౌకలను అడ్డుకునే చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇరాన్‌ సైతం గుర్రుగానే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధ పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు స్పందించారు. జేడీవాన్స్ మాట్లాడుతూ, ఇరాన్‌తో చర్చలకు ఇంకా అవకాశముందని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపడం పూర్తిగా తమ చేతుల్లో లేదని, ఇప్పుడు నిర్ణయం ఇరాన్ వైఖరిపైనే ఆధారపడి ఉందని తెలిపారు.

వివరాలు 

జలసంధి ప్రాంతంలో నౌకలను అడ్డుకోవడం ఆర్థిక దాడిగా భావించాలి: వాన్స్  

ఇరాన్ సహకార ధోరణి అవలంబించాల్సిన అవసరం ఉందని సూచించారు. జలసంధి ప్రాంతంలో నౌకలను అడ్డుకోవడం ఆర్థిక దాడిగా భావించాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ ఇటువంటి చర్యలకు పాల్పడితే తమ నౌకలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హర్ముజ్ ప్రాంతంలో ఇరాన్ చర్యలను అడ్డుకునే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ దేశ నాయకత్వంలో అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement